అన్వేషించండి

Chandrababu counter to Jagan : అవును నేను పశుపతినే, శివుడినే - జగన్‌కు చంద్రబాబు కౌంటర్ !

Andhra News : పశుపతి అంటూ జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. పశుపతి అంటే శివుడని..తాను ఆ మాటను అంగీకరిస్తున్నానని అన్నారు.

Chandrababu countered Jagan criticism As Pashupati : సీఎం జగన్ మదనపల్లె సభలో తనను  పశుపతి అనడంపై చంద్రబాబు ప్రజాగళం సభలో కౌంటర్ ఇచ్చారు.  ఆ మాట విని నవ్వుకున్నానని తెలిపారు. తనను పశుపతి అనడం పట్ల తానేమీ ఆశ్చర్యపోలేదని, పశుపతి అంటే ప్రపంచాన్ని  శివుడు అని వివరించారు. అందుకే తాను శివ అవతారం ఎత్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు.   "నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా... ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా మీరు చూస్తున్నారు... నన్ను అనేక మాటలు అన్నారు, మిత్రుడు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన... మళ్లీ తెలుగుజాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడ్ని అవుతున్నా" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని, నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పావు. కానీ జనాలను మోసం చేశావు. నాణ్యత లేని బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. రూ.60 క్వార్టర్ బాటిల్ ఇవాళ రూ.200 పలుకుతోంది. రూ.140 ఎవరి జేబులోకి పోతోంది? మద్యం తయారుచేసేది వీళ్లే, సరఫరా చేసేది వీళ్లే, అమ్మేది వీళ్లే, డబ్బులు కూడా వీళ్లకే. మళ్లా మద్య నిషేధం అని చెప్పి ఓట్లు పొందాలనే కుట్ర రాజకీయం కూడా వీళ్లదే.  ఐదేళ్ల తర్వాత జనాల్లోకి వస్తున్నాడు. మొన్నటిదాకా ఆకాశంలో ఈయన వస్తే కింద ఉన్న చెట్లు కొట్టేసేవారు. మోసపూరితమైన మాటలు చెబుతూ, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. ప్రజలు అతడ్ని అడుగడుగునా నిలదీయాలి. మద్యపాన నిషేధం తర్వాతే ఓటు అడుగుతానని చెప్పారు... చేశారా? అని మీరు అడగాలి. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి వచ్చింది. ఎక్కడ చూసినా గంజాయే. కొత్తగా విశాఖ పోర్టుకు 25 వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి. వైసీపీ నేతలు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.  

నిన్ననే చూశాం. పెన్షన్ల పేరిట కొత్త డ్రామాకు తెరలేపారు. ఎప్పటినుంచో పేదలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ఎవరు ప్రారంభించారు ఈ పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు రూ.35తో పెన్షన్లు ప్రారంభించారు. రూ.200గా ఉన్న పెన్షన్ ను 2014లో నేను ముఖ్యమంత్రిని అయ్యాక రూ.2 వేలు చేశాం. ఇప్పుడు ఈయన వచ్చిన ముక్కుతూ మూలుగుతూ వెయ్యి రూపాయలు పెంచాడు. పెంచుకుంటూ పోతానని రూ.250 పెంచుతూ వచ్చాడు. ఇప్పుడది రూ.3 వేలు అయ్యేసరికి ఈయన పోతున్నాడు. నేను గత ఎన్నికల్లో గెలిచి ఉంటే మొదటి నెలే రూ.3 వేలు ఇచ్చేవాడ్ని. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.  

ఏపీలో ఓట్ల కోసం అధికార పార్టీ దిగజారిపోయింది. పెన్షన్లపై నీచ రాజకీయాలు చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని కోరుతున్నాం. రేపు వచ్చేది ఎన్డీయే ప్రభుత్వం. మీకు కూడా న్యాయం చేస్తాం. వాలంటీర్లలో బాగా చదువుకున్నవారు ఉన్నారు... రూ.5 వేలు కాదు, వారు రూ.50 వేలు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని హామీ ఇచ్చారు.  వాలంటీర్లను రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి, వారిని వైసీపీ కార్యకర్తలుగా తయారుచేస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు, పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. సచివాలయ ఉద్యోగుల సాయంతో రెండ్రోజుల్లోనే అందరికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చు... ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు. కానీ, కోడికత్తి డ్రామా కమలహాసన్ చేసిన పని మీరందరూ చూశారని సెటైర్ వేశారు.  ఈయనకు సానుభూతి కావాలి. బాబాయ్ ని చంపి సానుభూతి తెచ్చుకుని 2019 ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నాడు. అదే సమయంలో కోడికత్తి డ్రామా ఆడాడు. ఈయనను కోడికత్తితో చంపేస్తారట. ఆ డ్రామాతో కూడా ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు వృద్ధులను కూడా చంపేసి, మా వల్లే చనిపోయారని డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget