Chandrababu on KCR: ఆ విషయంలో కేసీఆర్‌ను మెచ్చుకున్న చంద్రబాబు.. ఏం చేస్తున్నారని ఏపీ సీఎంపై ధ్వజం
గురువారం ఉదయం 8 గంటలకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష మొదలు పెట్టారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ చర్యలను గుర్తు చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ వ్యవస్థ వేళ్లూనుకుపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖ మన్యం ప్రాంతాల్లో వేల ఎకరాల్లో సాగవుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. గురువారం (అక్టోబరు 21) ఉదయం 8 గంటలకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియా ఉందని ప్రభుత్వం వాటిని రూపుమాపే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
కొద్ది రోజుల క్రితం తెలంగాణలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడిన వ్యాఖ్యలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. గంజాయి అంతా ఏపీ నుంచే తెలంగాణ, హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తోందని సీపీ కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బుధవారం ప్రగతి భవన్‌లో ఓ రివ్యూ మీటింగ్ పెట్టి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తామని చెప్పారని చంద్రబాబు అన్నారు. అక్కడ సీఎం డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో డ్రగ్స్, గంజాయిని సహించబోమని కేసీఆర్ చెప్పినట్లుగా చంద్రబాబు అన్నారు. ఇక్కడ సీఎం జగన్ ఒక్క మీటింగ్ అయినా పెట్టారా? అని ప్రశ్నించారు.
‘‘రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క ఏపీలోనే 25 వేల ఎకరాల్లో 8 వేల కోట్ల రూపాయలు విలువచేసే గంజాయి పంట పండుతోంది. ఎక్కడికక్కడ దేశం మొత్తం పంపిణీ చేస్తే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.’’ అని చంద్రబాబు ఆరోపించారు.
Also Read: టీడీపీ నేత పట్టాభి అరెస్ట్.. తలుపులు బద్దలుకొట్టి మరీ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు..
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడండి.. మేమూ సహకరిస్తాం
‘‘గంజాయి, డ్రగ్స్ వాడుతున్న, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపండి. అందుకు ప్రభుత్వానికి మేం కూడా సహకరిస్తాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేవారిపై ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే చరిత్ర హీనులుగా మారిపోతారు గుర్తుంచుకోండి’’ అని చంద్రబాబు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వాన్ని స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నానని చంద్రబాబు చెప్పారు. దీనిపై పోరాడేందుకే ఈ రోజు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ‘‘కొంత మంది దాడి చేస్తే మనం భయపడిపోతామని అనుకుంటున్నారు. మొన్న కూడా రఘురామక్రిష్ణం రాజును పోలీసులు బాగా కొట్టి.. తర్వాత రోజు మెజిస్ట్రేటు దగ్గరికి తీసుకెళ్లారు.’’ అని చంద్రబాబు అన్నారు.
Also Read: పోలీసులకు సిగ్గు లేదా?, నీ కథ ఏంటో చూస్తా..! ఆ పని చేస్తే జగన్‌కి మేమూ సహకరిస్తాం: చంద్రబాబు
‘‘నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశా. అందరు ముఖ్యమంత్రుల్లో కెల్లా ఈయన కాస్త విభిన్నమైన వ్యక్తి. ఈయన క్యారెక్టర్‌లోనే చాలా లోపం ఉంది. అలాంటి వ్యక్తికి మందిచ్చి సరిచేసే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది. పోలీసులు గానీ, వైఎస్ఆర్ సీపీ నాయకులకు నేను ఒకటే కోరుతున్నా.. మీ పదవుల కోసం, పోస్టింగుల కోసం చూడకండి. సమాజం కోసం మీ పిల్లల కోసం ఆలోచించండి. ఇప్పటిదాకా మా పార్టీ మంచితనాన్ని చూశారు. భవిష్యత్తులో మీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తప్పకుండా శిక్ష పడేలా చూస్తాం. ఇప్పటికైనా మారండి’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
Also Read: TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?
Also Read: అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి