News
News
X

Viveka Murder Case : మళ్లీ పులివెందులలో సీబీఐ అధికారులు - వివేకా కేసులో త్వరలో సంచలనాలు ?

వైఎస్ వివేకా హత్య కేసులోసీబీఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించారు. పులివెందులలో ఇనయతుల్లా అనే వ్యక్తిని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

FOLLOW US: 

Viveka Murder Case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు.  వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇనయతుల్లా వివేకాకు వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంట్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవారు. 2019 మార్చి 19న హత్య జరిగినప్పుడు వివేకా ఇంట్లోకి తొలుత వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహానికి ఫొటోలు, వీడియోలను ఇనయతుల్లానే తీశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ ద్వారానే ఇతరులకు ఫొటోలు షేర్ చేశారు.  ఫొటోలు ఎవరెవరికి పంపారు? ఆ ఫొటోలు తీసినప్పుడు ఎవరెవరు ఉన్నారు? తదితర వివరాలను సీబీఐ ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. 

దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై కేసు పెట్టడంతో హైకోర్టులో సీబీఐ పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల కీలక  పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై  నమోదు చేసిన  ప్రైవేటు పిటిషన్లు కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు నిందితుల్ని పిలిస్తే తమపైనే కేసులు దాఖలు చేస్తే ఇక వివేకా కేసులో దర్యాప్తు ముందుకు సాగదని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తేల్చిచెప్పేశారు. నిందితుల వ్యవహారశైలిపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో దిగువ కోర్టుల్లో దాఖలైన ప్రైవేటు పిటిషన్లను కొట్టేయాలని కోరింది. దీనిపై 22వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. 

కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సునీత పిటిషన్

మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దానిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది.   సీబీఐ విచారణలో కేసు ముందుకు వెళ్లట్లేదని, ఏపీ ప్రభుత్వం నుంచి పెద్దగా సహాయ సహకారాలు లేవంటూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సునీత తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. సీబీఐ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.  

వైఎస్ వివేకా హత్య కేసులో  త్వరలో కీలక పరిణామాలుంటాయాా ?

గత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ వివేకా పులివెందులలోని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌లను నియమించినా నిందుతుల్ని పట్టుకోలేకపోయారు. చివరికి  హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం సహకారం పెద్దగా లేకపోవడంతో సీబీఐ అధికారుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది.  హఠాత్తుగా విచారణ ఆపేస్తారు.. మళ్లీ ప్రారంభిస్తారు... ఎప్పటికి దర్యాప్తు పూర్తి చేస్తామో చెప్పలేమని సీబీఐ అధికారులు కోర్టుకు సీబీఐ అధికారులు గతంలో తెలిపారు. 

రాజకీయం దూరం కాలేదు - చిరంజీవి బ్లాస్టింగ్ కామెంట్స్ ! అసలు విషయం ఇదేనా ?

Published at : 20 Sep 2022 04:56 PM (IST) Tags: pulivendula YS Vivekananda Reddy murder case YS Viveka CBI case

సంబంధిత కథనాలు

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Breaking News Live Telugu Updates: ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు : అచ్చెన్నాయుడు

Breaking News Live Telugu Updates: ఉత్తరాంధ్ర మంత్రులు దద్దమ్మలు : అచ్చెన్నాయుడు

టాప్ స్టోరీస్

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

India vs South Africa T20: మెగా టోర్నీకి ముందు ఆఖరి అవకాశం.. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్

India vs South Africa T20: మెగా టోర్నీకి ముందు ఆఖరి అవకాశం.. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్