Andhra Pradesh Districts Names: ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
Andhra : ఏపీలో జిల్లాల పేర్ల విషయంలో మార్పు చేర్పులపై మంత్రుల కమిటీని నియమించారు. ప్రాంతీయ హక్కులు, ప్రజల అభిప్రాయాల మేరకు సిఫారసులు చేయనున్నారు.

Cabinet Sub committee On Districts Names: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు అయింది. సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్ ఉంటారు. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేసి కమిటీ నివేదిక సమర్పిస్తుంది. సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని సబ్ కమిటీకి ప్రభుత్వం సూచించింది.
జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పు , సరిహద్దుల సవరణలపై ప్రజల నుండి సూచనలు, విజ్ఞప్తులను కమిటీ సేకరిస్తుంది. ప్రజల అభిప్రాయాలను, చారిత్రక, సాంస్కృతిక, ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర అధ్యయనం చేస్తుంది. అధ్యయనం ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి కమిటీ సమర్పిస్తుంది. ప్రభుత్వం సూచించినట్లు, ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు, చారిత్రక నేపథ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి సిఫారసులు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2022లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేసింది. ఈ జిల్లాల పేర్లు, సరిహద్దులు కొన్ని వివాదాస్పదంగా మారాయి. కొన్ని జిల్లాల పేర్లు, మండలాల సరిహద్దులపై స్థానికుల నుండి అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, పారదర్శకంగా, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లాల పేర్లు, సరిహద్దులను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాలను పారదర్శకంగా పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవాలని కమిటీకి సూచించారు. కమిటీ నిర్దిష్ట సమయంలో నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఏపీలో జిల్లాల పేర్లు మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ.
— Telugu Stride (@TeluguStride) July 22, 2025
ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్ధన్‌రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల, సత్యకుమార్. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేయనున్న కమిటీ. సబ్‌కమిటీ నివేదిక ఆధారంగా… pic.twitter.com/HXdD8w8asE
కమిటీ ప్రజల నుండి సేకరించిన సూచనలు, అధ్యయనాల ఆధారంగా నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పేర్ల మార్పు, సరిహద్దుల సవరణలపై తుది నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకునే ముందు, ప్రజల అభిప్రాయాలను విస్తృతంగా సేకరించడం, చర్చిస్తారు. ఈ చర్యను ప్రజాభిప్రాయాన్ని గౌరవించే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు.





















