YSRCP News : చంద్రబాబుపై సజ్జల చేసిన కామెంట్స్‌పై బొత్స అసహనం - అసలేం జరిగిందంటే ?
చంద్రబాబును త్వరలో అరెస్ట్ చేస్తామన్న సజ్జల వ్యాఖ్యలపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. తాను అలా మాట్లాడబోనన్నారు.
YSRCP News : బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో అత్యంత సీనియర్. దిగువ స్థాయి నుంచి ఎదిగారు. వైఎస్ఆర్‌సీపీలో కూడా ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణఆరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా చంద్రబాబును ఉద్దేశించి చేసినవి కావడంతో వైఎస్ఆర్‌సీపీలో చర్చ జరుగుతోంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కూడా త్వరలో అరెస్ట్ అవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రోజుల కిందట వ్యాఖ్యానించారు. వీటిపై రాజకీయ దుమారం రేగింది. రోజా, జోగి రమేష్ సహా చాలా మంది మంత్రులు అదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ బొత్స సత్యనారాయణకు మాత్రం అలా అనడం నచ్చలేదు. సజ్జల తరహాలో తానైతే కామెంట్స్ చేయనని స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలు ఉంటే ఎవరికయినా చట్టం వర్తిస్తుందని ..ఎవ్వరూ చట్టానికి అతీతలుగా ఉండే పరిస్దితి లేదన్నారు. అలాంటిది చంద్రబాబు అయినా వేరెవరయినా సరే ఇదే వర్తిస్తుందన్నారు.
అయితే పొలిటికల్ గా కీ రోల్స్ లో ఉన్న వారు ఇలాంటి కామెంట్స్ చేస్తే రాజకీయంగా అది అవతల వ్యక్తులకు ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయిని బొత్స విశ్లేషించారు. ఇంత చిన్న లాజిక్ ను సజ్జల ఎలా మిస్ అయ్యారో తనకు అర్దం కావటం లేదని బొత్స అసహనం వ్యక్తం చేశారు. అందులోనూ చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తామని, రాజకీయంగా అధికారంలో ఉన్న నేతలు ప్రకటిస్తే, దాన్ని తన అవసరానికి వినియోగించుకొని సానుభూతి ని క్రియేట్ చేసుకోవటంలో చంద్రబాబు సిద్దహస్తుడని బొత్స అభిప్రాయం. సజ్జల వ్యాఖ్యల వల్ల అలాంటి పరిస్దితులను మనమే క్రియేట్ చేసి పెట్టిన వారమవుతామని ఆయన వ్యాఖ్యానించారు.
విచారణ చేసిన అధికారులు తమ దర్యాప్తులో లభించిన ఆధారాల ప్రకారం చట్ట ప్రకారం వ్యవహరిస్తారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటుందని ఈ విషయాలను మనం గుర్తించాలని మీడియా చిట్ చాట్ లో అన్నారు. అనవసరంగా ఎదుటి వారికి అవకాశాలను మనమే క్రియేట్ చేసి చేతుల్లో పెట్టే పద్దతి తనది కాదని సజ్జల అలా ఎందుకు మాట్లాడారో కాని తానయితే అలాంటి మాటలు చెప్పనంటూ బొత్స స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమయిన పాత్ర పోషిస్తున్న సజ్జల రామ కృష్ణా రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేస్తామంటూ మాట్లాడటం రాజకీయవర్గాల్లో చర్చ మెదలయ్యింది.ఇక తెలుగు దేశం నేతల తీరు సరే..సరే...సజ్జల కామెంట్స్ పై ప్రతిపక్ష నేతలు కౌంటర్లు కూడ ఇచ్చారు.ఇది రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.మాజీ ముఖ్యమంత్రి స్దాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయటం వెనుక రాజకీయ కుట్రలే అంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఫైర్ అయ్యింది.రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటివి చేస్తున్నారంటూ తెలగు దేశం నాయకులు మండిపడ్డారు.అవసరం అయితే న్యాయ పోరాటం చేస్తామంటూ కూడ కౌంటర్లు ఇచ్చారు.