అన్వేషించండి

Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ - ఈ జిల్లాల్లో తీవ్ర సంక్షోభంలో పౌల్ట్రీ పరిశ్రమ

AP news: బర్డ్ ఫ్లూ ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఫౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు సాగక పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Bird Flu Effect on Poultry Industry in Chittor Districts: నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో వేలాది కోళ్లు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జిల్లాతో పాటు పక్కనే చిత్తూరు జిల్లాలోనూ ఫౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక్కడి నుంచి బెంగుళూరు, పాండిచ్చేరి, చెన్నైలకు కోళ్లు, కోడిగుడ్లు ఎక్కువగా జరిగే ఎగుమతులపై బర్డ్ ఫ్లూ ప్రభావం పడింది. పౌల్ట్రీ ఉత్పత్తులను అనుమతించడం లేదని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పెరటి కోళ్ల పెంపకం జరుగుతుండగా.. ప్రతి ఏటా రూ.800 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటుంది. ఏడాదికి 37,089 మెట్రిక్ టన్నుల కోళ్లు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్ సంస్థలు, రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. సరాసరి రోజుకు రూ.5 కోట్ల వ్యాపారం జరిగేదని.. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పౌల్ట్రీ వాహనాలను చెక్ పోస్టుల వద్ద ఆపేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. కాగా, జిల్లాలో దాదాపు 8 వేల మంది రైతులు ఫౌల్ట్రీ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం

అటు, బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చిత్తూరు జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. మొత్తం 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని.. పీపీఈ కిట్లు, క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి కోళ్ల ఎగుమతులను నిషేధించినట్లు చెప్పారు. పశు వైద్య సిబ్బంది ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజల్లో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పిస్తోందని.. జిల్లా పశు సంవర్థక శాఖ జేడీ ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకుని చికెన్, కోడిగుడ్లు వినియోగించాలని సూచిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో వ్యాప్తి

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో (BirdFlu) వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో, పశు సంవర్థక శాఖ అధికారులు, యంత్రాంగం అప్రమత్తమయ్యారు. కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ను భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో వేలాది కోళ్లు చనిపోయాయి. వీటిని పరిశీలించిన అధికారులు బర్డ్ ఫ్లూతోనే మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10 కి.మీల పరిధిలోని ప్రాంతాల్లో 3 రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని.. కిలో మీటర్ పరిధిలోని ప్రాంతాల్లో చికెన్ షాపులు 3 నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపు యజమానుల్లో చైతన్యం తేవాలని.. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని సూచించారు. వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశామని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. వైరస్ ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలో మీటర్ వరకూ ఇన్ఫెక్టెట్ ప్రాంతంగా, 10 కిలో మీటర్ల వరకూ సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించినట్లు చెప్పారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలను కట్టడి చేశామని అన్నారు. కోళ్లు అధికంగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వలస పక్షులు వచ్చే నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ అదుపులోనే ఉందని.. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే 1962 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. జిల్లాలోని 2 గ్రామాల్లో తప్ప ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు. వైరస్ విస్తరించకుండా తగు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 

Also Read: Ban On Onion Exports : దేశంలో ఉల్లి ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధం- వదంతులపై స్పందించిన కేంద్రం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget