By: ABP Desam | Updated at : 20 Oct 2022 09:22 PM (IST)
Edited By: jyothi
నవంబర్ 1 న నెక్లెస్ రోడ్డుపై ఇందిరా గాంధీ విగ్రహానికి రాహుల్ నివాళి
Bharat Zodo Yatra: భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో 375 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగనుంది. ఇందులో భాగంగా నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి రాహుల్ గాంధీ పూలమాల వేసి నివాళి అర్పించనున్నారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగనుంది. రాష్ట్రంలో జరగనున్న జోడో యాత్ర ఏర్పాట్లు, జనసమీకరణపై గాంధీ భవన్ లో ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ సెక్రటరీ నదీము జావీద్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో 375 కిలోమీటర్ల పాదయాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 60 యేండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహానేతకు ప్రజలు బ్రహ్మ రథం పడతారని తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నేత చేయలేని సుదీర్ఘ పాదయాత్రను రాహుల్ గాంధీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. దేశ చరిత్రలో రాహుల్ గాంధీ యాత్ర నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ 375 కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారని.. భారత్ జోడో యాత్రలో మొబిలైజేషన్ కమిటీ కీలకపాత్ర పోషించబోతుందని వెల్లడించారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు చార్మినార్ గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగబోతుందని తెలిపారు. నవంబర్ 1న నెక్లెస్ రోడ్ లోని ఇంధిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఇంధిరా గాంధీ కి నివాళులు అర్పిస్తారని చెప్పారు.
23వ తేదీన తెలంగాణలోకి ఎంట్రీ
దేశంలో ఎవరూ చేయలేని ఒక సాహాసోపేత యాత్రను రాహుల్ గాంధీ చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర మైలురాయిగా మిగలబోతుందని తెలిపారు. ఉదయం 6 గంటలకే పాదయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. ఉదయం 5 నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర లో ప్రజలు పాల్గొనేందుకు సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రెండు కిలోమీటర్ల కు ఒక రిసీవింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి మునుగోడు భాధ్యతలు తీసుకుని పనిచేస్తున్నారని, మేము జోడో యాత్ర బాధ్యత తీసుకుని పనిచేస్తున్నామని భారత్ జోడో యాత్ర మొబిలైజేషన్ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ప్రతిరోజు రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో లక్ష మంది పాల్గొంటారని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం పూట రాహుల్ ప్రజలతో మమేకమవుతారని పేర్కొన్నారు. 23వ తేదీనే మక్తల్ సమీపంలోని కృష్ణా బ్రిడ్జి వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానున్నది. అనంతరం రెండు రోజుల పాటు యాత్రకు విశ్రాంతి ఇవ్వనున్నారు. దీపావళి సందర్బంగా యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల దసరా సందర్భంగా కూడా రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అయినా.. ఆ తర్వాత 26 నుంచి మాత్రమే కొనసాగనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్ రిసెర్చ్ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?
/body>