Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh : వైఎస్ఆర్‌సీపీకి భవిష్యత్ లేదని మంచి రోజు చూసుకుని జనసేనలో చేరుతానని బాలినేని ప్రకటించారు. మంగళగరిలో జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు.
YSRCP Politics : మంచి రోజు చూసుకుని జనసేన పార్టీలో చేరుతానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళగరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేసి ఆస్తులన్నీ కోల్పోయానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జగన్ కు చేత కాదన్నారు. వైసీపీకి భవిష్యత్ లేదు.. జగన్ కు విశ్వసనీయత లేదన్నారు. జగన్ కోసం ఆనాడు రాజీనామాలు చేసినా .. తర్వాత తమను పట్టించుకోలేదన్నారు.
కేతిరెడ్డి, విడదల రజనీ కూడా జనసేన దారిలో - అపాయింట్‌మెంట్లు ప్రస్తుతానికి పెండింగ్ !?
పవన్ కల్యాణ్ తనపై ఎంతో అభిమానం చూపిస్తున్నారని బాలినేని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తన గురించి ప్రకాశం జిల్లాలో జరిగిన సభల్లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం..ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా మంచి నేతగా గుర్తించారని తెలిపారు. భేటీలో పవన్ మందు ఎలాంటి డిమాండ్ పెట్టలేదన్నారు. తనతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు జనసేన పార్టీలో చేరుతారని బాలినేని శ్రీనివసారెడ్డి తెలిపారు. పవర్ అవసరం లేదు.. పదవి అవసరం లేదని.. గౌరవం చాలని బాలినేని చెబుతున్నారు. ఒంగోలులోనే చేరిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి బలప్రదర్శన ద్వారానే పార్టీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని చూసి జగన్ వెంట నడిచామన్నారు. వైఎస్ జగన్మోనహన్ రెడ్డి తనవ ఐదేళ్ల పాలనలో ఒక్క హామీైని కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఎలాంటి పనులు చేయించలేకపోయామని..తనను ప్రోత్సహించే అవకాశం వచ్చినా పట్టించుకోలేదని సామినేని ఉదయభాను తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రాజీనామా చేస్తానని ఇరవై రెండో తేదీన జనసేన పార్టీలో చేరుతానని ప్రకటించారు.
నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?
పలువురరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు జనసేన పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. తోట త్రిమూర్తులు కూడా జనసేన నేతల్ని సంప్రదిస్తున్నారు. సామినేని ఉదయభాను .. తోట త్రిమూర్తులు అంశాన్ని పవన్ వద్ద ప్రస్తాంచినట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ నుంచి ఆయనను చేర్చుకునే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. త్రిమూర్తులు ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి.. ఇతరులపై తవ్ర విమర్శలు చేస్తూంటారు. ఆయన టీడీపీ .. వైసీపీ.. కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు మారారాని.. ఆయనను నమ్మలేమని అంటున్నారు. కూటమి పార్టీలకు ఇబ్బంది లేకుండానే చేరికలు కొనసాగించాలని జనసేన పార్టీ నిర్ణయించుకుంది.