అన్వేషించండి

Avanigadda YSRCP : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ? చివరికి సింహాద్రి రమేష్‌కు హ్యాండిస్తారా ?

Andhra News : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సింహాద్రి రమేష్‌కు చివరికి టిక్కెట్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Avanigadda YSRCP ticket case is taking many turns :   ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవని గడ్డ నియోపకవర్గం ప్రతిష్టాత్మకమైనది.  సింహాద్రి రమేష్‌ బాబు  గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి ఆయనను సీఎం జగన్ మార్చాలనుకున్నారు. ఇటీవల కసరత్తులో భాగంగా ఆయనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నిర్మయంచారు. సింహాద్రి చంద్రశేఖర్ అనే వైద్యుడ్ని అవనిగడ్డ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ మార్పులపై ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదు.                

సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీగా ప్రకటన 

గురువారం సాయంత్రం వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన పదో జాబితాలో అవినిగడ్డ సమన్వయకర్తగా మళ్లీ సింహాద్రి రమేష్  ను నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ ను  మచిలీపట్నం ఎంపీగా పంపించారు.   తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.    

మొదటి నుంచి గందరగోళమే 

అధికార వైసీపీలో ఇన్‌చార్జ్‌లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   సింహాద్రి చంద్రశేఖర్‌రావును  ఎమ్మెల్యే అభ్యర్థిగా  ఖరారు చేసిన  తర్వాత  ఆయన సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు.  తర్వాత తనకు వయసు సహకరించదని..  తన కుమారుడు రామ్‌ చరణ్‌ కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను  అప్పగించాలని ఆయన కోరారు.  సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్‌ చంధ్రశేఖర్‌.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ’అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరన్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్‌ చరణ్‌ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతి గడపకు తిరుగుతాడని ప్రకటించారు కానీ మళ్లీ మారిపోయింది. 

వైసీపీలోకి మండలి బుద్ద  ప్రసాద్ ను ఆకర్షించే ప్రయత్నం 
  
సింహాద్రి రమేష్ ను మళ్లీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనల్లో ఉందని చెబుతున్నారు. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్తోంది. టీడీపీ తరపునఇక్కడ సీనియర్‌ నేత మండలి బుద్ధ ప్రసాద్‌ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మండలి బుద్దప్రసాద్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే  సింహాద్రి రమేష్ కు హ్యాండిచ్చి.. బుద్ద ప్రసాద్ ను అభ్యర్థిగా ఖ౮రారు చేసే అవకాశం ఉంది.                    

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget