అన్వేషించండి

Janasena : జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ - అవనిగడ్ నుంచి పోటీ చేసే అవకాశం

Andhra News : అవనిగడ్డ టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. ఆయన జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది.

Mandali Buddhaprasad joined Janasena :  ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్  జనసేన పార్టీలో చేరారు.  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయనతో పాటు అనుచరులు  కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు  చెబుతున్నారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థిగా బుద్దప్రసాద్ ఉన్నారు.  ఈ కారణంగా ఆయన అసంతృప్తికి గురయ్యారు.  1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది.  ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది.  

అవనిగడ్డ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకి కేటాయించగా, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్‌కే మెస్‌ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్‌ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్‌ తదితరులు ప్రయత్నాలు చేశారు. కొద్దిరోజుల క్రితం జనసేన ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించగా, అందులో విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణల పేర్లకు ఎక్కువ ఆమోదం లభించింది.   వారిలో ఎవరో ఒకరికి జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా శనివారం నుంచి బుద్ధప్రసాద్‌ పేరు తెరపైకి రావటంతో  జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.   గతంలో వైసీపీ నుంచి కూడా బుద్ద ప్రసాద్‌కు ఆఫర్ వచ్చింది.  రెండు పార్టీల ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరమని విజ్ఞప్తి చేసినందున .. ఆ దిశగానే మండలి బుద్ద ప్రసాద్ మొగ్గు చూపారు.    

అవనిగడ్డలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఆరు మండలాల జనసేన నేతలు, క్యాడర్ సమావేశమయ్యారు. టికెట్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌కి ఇస్తున్నారన్న ప్రచారంపై సమావేశం నిర్వహించారు. ఈ సీటు జనసేనకు ఇస్తే గెలవదు అని రాజీనామాలు చేసిన టీడీపీ నేతల వ్యాఖ్యలపై జన సేన నేతలు ఫైర్ అయ్యారు. టికెట్ బుద్ధ ప్రసాద్ కు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చించారు. అవనిగడ్డ సీటు జనసేన పార్టీ వారికే ఇచ్చేలా పోరాటం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ జనసేన నేతలు, కేడర్‌కు సూచించారు. అయితే పవన్...బుద్దప్రసాద్‌ను చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ప్రకటిస్తే.. వీరు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. 

అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కవగా ఉంటుంది. ముందు నుంచి జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో దాదాపుగా ముప్పై వేల ఓట్ల వరకూ వచ్చాయి. కూటమిలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏకపక్ష విజయం వస్తుందన్న నమ్మకంతో.. ఉన్నారు.                                                     

 

 

టాప్ హెడ్ లైన్స్

Janasena Committee On Balaraju:పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget