అన్వేషించండి

TDP Mahanadu : టీడీపీ మహానాడుకు పసుపుమయమైన రాజమండ్రి - భారీగా ఏర్పాట్లు !

టీడీపీ మహానాడుకు రాజమండ్రిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కీలక నేతలంతా ఒక రోజు ముందే రాజమండ్రి చేరుకుంటన్నారు.

 

TDP  Mahanadu :    తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడుకు గోదావరి తీరం ముస్తాబయింది.  రాజమహేంద్రవరంలో నిర్వ హించనున్న మహానాడుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. పార్టీ సమావేశా లు, సభలకు అవసరమైన ప్రాంగణాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.తొలిరోజు 27న ప్రతినిధుల సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరు కానున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మహానాడు లోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచనున్న అనేక కీలక అంశాలతో పాటు ప్రాథమిక అంశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించనున్నారు.

రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం కడియం మండలం వేమగిరిలో నిర్వహించే మహానాడు ప్రత్యేకత చాటేలా ఏర్పాట్లు చేశారు.  ఎన్టీఆర్‌ శత జ యంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఈ నెల 28న ఎన్టీఆర్‌ కు నివాళులర్పించిన అనంతరం దాదాపు 15 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించను న్నారు.పార్టీ నేతలు, శ్రేణులకు ఎన్నికల కార్యా చరణపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో మహానాడులో మేనిఫెస్టోపై ప్రాథమిక అంశాలను వెల్లడిం చనున్నట్లు- సమాచారం.
వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రం వివిధ రంగాల్లో నష్టపోయిన పరిస్థితులపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. 

కనీ వినీ ఎరుగని రీతిలో మహానాడును ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్య క్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు.  జాతీయ అధ్యక్షుడు నుంచి క్లస్టర్‌ ఇన్‌ చార్జ్‌ ల వరకు దాదాపు 15వేల మంది ప్రతినిధులతో తొలిరోజు సభ నిర్వహి స్తామని, అయితే దీనికి లక్ష మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతుందని మహానాడులో ప్రవేశపెట్టనున్న తీర్మానాలకు పొలిట్‌ బ్యూరో ఆమోదం తెలుపనుందని వెల్లడించారు. మొత్తం 15 తీర్మానాలు ప్రవేశపెట్ట డంతో పాటు పలు కీలక ప్రకటనలు పార్టీ అధిష్టానం మహానాడు వేదికగా చేయనుం ద ని తెలిపారు. ముఖ్యంగా వైకాపా పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి దశ, దిశ నిర్దేశించే విధంగా పలు తీర్మా నాలను మహానాడులో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.                           
  
తెలుగుదేశం పార్టీ  మహానాడుకు హాజరయ్యేందుకు తెలుగు తమ్ముళ్లకు ఆహ్వానాలు అందాయి.ఈ నెల 27న ప్రతి నిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిజిటల్‌ సంతకంతో పార్టీ యంత్రాంగం ఆహ్వానాలు పంపుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్‌ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సంద ర్భంగా కొనియాడారు.ఈ ఆహ్వాన పత్రిక లో రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు.                           

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget