Audio tapes: ఆడియో టేపుల వ్యవహరంపై విచారణ అవసరం... మహిళా కమిషన్ చీఫ్ వాసిరెడ్డి పద్మ
ఏపీలో అధికార పార్టీల నేతల ఆడియో టేపుల వివాదంపై విచారణ అవసరమని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు.
ఏపీలో ఇటీవల ఓ మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినవి అని ఆడియో టేపులు వైరల్ అయ్యాయి. ఈ టేపులపై సదరు నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. వీటిల్లో మాట్లాడింది తాము కాదని నేతలు చెప్పుకొచ్చారు. ఈ టేపుల వ్యవహారంపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఆడియో టేపులపై విచారణ అవసరమన్నారు. ఈ వ్యవహారంపై ఆ నేతలను వివరణ కోరుతామన్నారు. మహిళా కమిషన్ తరఫున సమాచారం సేకరిస్తామన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?
టీడీపీ డెడ్ లైన్ సరికాదు
ఇటీవల గుంటూరులో హత్యకు గురైన ఎస్సీ యువతి రమ్య ఘటనపై కూడా కమిషన్ ఛైర్ పర్సన్ పద్మ స్పందించారు. ఘటనపై టీడీపీ 21 రోజుల డెడ్‌లైన్ పెట్టడం సరికాదన్నారు. నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. జగన్ ప్రభుత్వం మహిళల పక్షపాతి ప్రభుత్వమని పద్మ అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె... వైసీపీ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సంక్షేమ పథకాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తోందన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాల వల్ల మహిళా లోకానికే తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు.
Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్
దిశచట్టాన్ని ఆమోదించాలి
మహిళలపై ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వైసీపీ పాలనలో 4 శాతం క్రైం రేటు తగ్గిందన్నారు. మహిళా సాధికారత అనే పదాన్ని దేశానికి పరిచయం చేసింది సీఎం జగన్ అని పద్మ అన్నారు. దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు. ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని వాసిరెడ్డి పద్మ కోరారు.
Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!
Also Read: Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు మహేష్ బాబు సర్‌ప్రైజ్.. 154వ సినిమా టైటిల్ వచ్చేసింది..