(Source: ECI/ABP News/ABP Majha)
10th Betterment Exams : ఏపీ టెన్త్ విద్యార్థులకు మరో శుభవార్త - రెండు సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకోవచ్చు
ఏపీ టెన్త్ విద్యార్థులు రెండు సబ్జెక్టుల్లో బెటర్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో సబ్జెక్ట్‌కు రూ. 500 ఫీజు చెల్లించాలి.
10th Betterment Exams : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు తప్పిన వాళ్లు రెండు లక్షల మందికిపైగానే ( Faild Students ) ఉన్నారు. పాసయిన వాళ్లు నాలుగు లక్షల మందికిపైగానే ఉన్నారు. అయితే పాసయిన వాళ్లలోనూ కొంత అసంతృప్తి ఉంది. తాము రాసిన వాటి కన్నా మార్కులు తక్కువ వచ్చాయని వారి ఆవేదన. లేకపోతే సరిగ్గా రాయలేకపోయామని మరోసారి చాన్స్ వస్తే సత్తా చూపిస్తామని బాధపడేవాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి వారి బాధలను ఏపీ ప్రభుత్వం ఆలకించింది. బెటర్ మెంట్ ( Betterment Exam ) రాయడానికి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ బడుల్లో బైజూస్ క్లాసులు, ఏపీ సర్కార్ కీలక ఒప్పందం
త్వరలో జరగనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతో ( Advenced Supply ) పాటు విద్యార్థులు బెటర్‌మెంట్ రాసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. యాభై మార్కులు కంటే తక్కువ వచ్చిన రెండు సబ్జెక్టుల్లో ఎవరైనా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చన్న నమ్మకం ఉంటే.. బెటర్ మెంట్ రాసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో సబ్జెక్ట్‌కు ఐదు వందల రూపాయల చొప్పున ఫీజు ( Fee Rs. 500 ) చెల్లించాలి.
ఏపీలో పది మార్కులొచ్చిన వాళ్లూ పాసయ్యారా ? అసలు నిజం ఇదిగో
ఇప్పటికే పదో తరగతి పరీక్ష మొదటి ప్రయత్నంలో తప్పిన వారు.. సప్లిమెంటరీలో రాసి పాసయినా సరే.. డైరక్ట్‌గా పాసయినట్లుగా సర్టిఫికెట్ ( Pass Certificate ) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకే బెటర్ మెంట్ రాసినా సర్టిఫికెట్ మామూలుగానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పరీక్షలు, ఫలితాల ఒత్తిడి అధిగమించేందుకు తల్లిదండ్రులు విద్యార్థులకు చిట్కాలు
జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ప్రారంభయింది. జూన్ 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు ( Special Classes ) కూడా ప్రారంభించారు. రీ కౌంటింగ్ ( Re Counting ) కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున చెల్లించి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీల కోసం ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు ( Aplication ) చేసుకోవాలి. రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసేవారు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.