News
News
X

Breaking News Live Telugu Updates: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ ఏపీనే నెంబర్ 1

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
Ease of Doing Business Index: ఈజ్ అఫ్ డూయింగ్ లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్
 • ఈజ్ అఫ్ డూయింగ్ లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్
 • సత్తా చాటిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 
 • బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 లో ఏపీ టాప్ 
 • టాప్ అచీవర్స్ లో 7 రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం 
 • దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ 
 • 97.89 శాతం స్కోర్ తో ఏపీకి మొదటి స్థానం 
 • 97.77 శాతంతో రెండో స్థానంలో గుజరాత్ 
 • తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ స్కోర్ 94.86 శాతం 
 • టాప్ అచీవర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు 
 • 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 
 • టాప్ అచీవర్స్ లో స్థానం దక్కించుకున్న ఏపీ 
 • గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈ సారి ర్యాంకింగ్ ప్రక్రియ 
 • 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్ల నుంచి అభిప్రాయాల సేకరణ 
 • అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత
Alluri Seetharama Raju: భీమవరంలో అల్లూరి విగ్రహం సిద్ధం, జులై 4న ప్రధాని మోదీ ప్రారంభోత్సవం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని.. జూలై 4న ప్రధాని చేతుల మీదుగా అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.ఈ నేపథ్యంలో అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది.. పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మున్సిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అల్లూరి విగ్రహాన్ని దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువుతో పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు  ఆనే వ్యక్తి సహకారంతో తయారు చేయించారు.ఈ అల్లూరి విగ్రహాన్ని కాంక్రీట్‌ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకానుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని, కానీ కొన్ని సందర్భాల్లో తప్పడం లేదన్నారు.. ఇంత దుర్మార్గ పాలనా అందిస్తున్న జగన్, మంచి మనిషిగా మారాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.. సీఎంకు సంబంధం లేకుండా ఎలాంటి కార్యక్రమం జరగదని, మహిళల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా సీఎం జగన్ పాలనా ఉందని అనిత విమర్శించారు.

Hyderabad Collector: హైదరాబాద్ కలెక్టర్ గా అమోయ్ కుమార్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న అమోయ్‌ కుమార్‌కు హైదరాబాద్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుత హైదరాబాద్‌ కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ నేడు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టర్ ను నియమించే వరకూ అమోయ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

PSLV C - 53 Launch Today: నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-53 రాకెట్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో వేదికగా నేడు మరో రాకెట్‌ ప్రయోగం జరగనుంది. నేడు సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి 2 నిమిషాలు ఆలస్యంగా రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లాలోని షార్‌ రెండో వేదిక నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ వాహకనౌక సింగపూర్‌, కొరియాకు చెందిన 3 ఉప గ్రహాలను నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. బుధవారం సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌ డౌన్‌ను ప్రారంభించారు. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది.

Prakasam Road Accident: ప్రకాశం జిల్లాలో బస్సు - లారీ ఢీ, ఒకరు దుర్మరణం, 20 మందికి గాయాలు

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెస్తవారిపేట మండలంలో ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయిన ఓ ట్రావెల్‌ బస్సు లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 32 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఓ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళ్తోంది. పూసలవాడ గ్రామం వద్ద లారీని ఢీకొంది. నేషనల్ హైవేపై ఈ బస్సు అడ్డంగా బోల్తా పడడంతో రోడ్డుకి రెండు వైపులా కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్‌ సహాయంతో బస్సును అధికారులు పక్కకు తొలగించారు.

Background

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన కొనసాగుతోంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరుగా  వెల్లడించాయి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితి
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. తూర్పు పడమర ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఒడిశా తీరం నుంచి హరియాణా, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం మధ్య తీర ప్రాంత ఒడిశా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఉత్తర భారత దేశద్వీపకల్పం 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగి ఈ రోజు బలహీన పడింది.

ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్రలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


రాయలసీమలో
నేడు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. నేడు, రేపు తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

Telangana Weather: తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి సహా అన్ని జిల్లాల్లో నేడు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు, 22.5 డిగ్రీలుగా ఉంది.