Breaking News Live Telugu Updates: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, ఆమోదం తెలిపే అంశాలివే
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
Weather Latest News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడనున్నాయని అంచనా వేసింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు, రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే నేడు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో..
ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. నేడు రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
రాయలసీమలో..
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రోజూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.
Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ సహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెబ్ సైట్‌లో వెల్లడించారు.
హైదరాబాద్, పరిసర ప్రాంతాల వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు మరియు 24 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు, గాలివేగం గంటకు 8 నుంచి 12 గంటల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఆర్‌జీవీ ట్వీట్
ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఆర్‌జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.
మోదీకి క్లీన్ చిట్
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ..
- వైద్యఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- ఈనెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల
- మరో 4 సంక్షేమ పథకాలు పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- 35 సంస్థలకు భూకేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం
Secunderabad Riots: ఆవుల సుబ్బారావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అనుచరులతో కలిసి విధ్వంసానికి సుబ్బారావు స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆవుల సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులు ఈ అల్లర్లకు సాయపడ్డారు. నరేష్ అనే వ్యక్తి ఆందోళన కారులకు భోజనాలు అందేలా చూసుకున్నాడు. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొల్పేలా వాట్సప్ గ్రూపుల్లో ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. జూన్ 16నే సుబ్బారావు హైదరాబాద్‌కు చేరుకొని, తన అనుచరులతో మంతనాలు జరిపాడు. విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు.
షిండే శిబిరంలోకి పెరుగుతున్న వలసలు
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పతనం అంచుకు చేరుకోగా, అటు షిండేక్యాంప్‌లో అంతకంతకూ బలం పెరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆయన శిబిరంలోకి వెళ్లిపోతున్నారు. ఇటు శివసేన మాత్రం తమను తాము మహాశక్తిగా అభివర్ణిస్తూ ఎదురు దాడికి దిగుతున్నాయి. కానీ మె