అన్వేషించండి

AP Investments: రూ.20,216 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ - విశాఖకు పలు దిగ్గజ సంస్థల పెట్టుబడులు

AP SIPB విశాఖలో పలు సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను ఏపీ SIPB ఆమోదించింది. రూ.20,216 కోట్లను వివిధ సంస్థలు ఇన్వెస్ట్ చేయనున్నాయి.

AP SIPB approves investment proposals: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్... మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మత సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫి, సత్వా, బివిఎం, ఎఎన్ఎస్ఆర్ సంస్థలు రూ.20,216 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా... ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన 9వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. 

56000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న నారా లోకేష్ ... సమావేశంలో ఆయా పెట్టుబడులు గురించి వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు, వాటి స్థితిగతులు, బలాబలాలు వెల్లడించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ... భవిష్యత్ పెట్టుబడులకు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని... ఇప్పటికే అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఈక్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సిఎం ఆదేశించారు. పూణె, బెంగుళూరు వంటి పట్టణాల్లో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించగా... అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయం-రైలు కనెక్టవిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు. పూణె, బెంగుళూరు వంటి చోట్ల నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలన్నారు.  

 వివిధ కంపెనీల పెట్టుబడుల వివరాలు 

1. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటిదశలో రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు... 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. 
2. సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం-మధురవాడలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 
3. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం-ఎండాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. 
4. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం-మధురవాడలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 ఉద్యోగావకాశాలు వస్తాయి.
 
సిఫీ టెక్నాలజీస్ ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటి.  సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.3,621 కోట్ల టర్నోవర్, సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ రూ.1,114 కోట్ల టర్నోవర్ కలిగివుంది. రెండు ప్రాజెక్టులుగా వివిధ దశల్లో ఏపీలో తమ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఐటీ, ఐటీఈఎస్ పార్కులకు సంబంధించిన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో అనుభవం ఉంది. ప్రస్తుతం 8 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సత్వా... 80 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయ సముదాయాలను నిర్మిస్తోంది. కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ, రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయనుంది.  ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, జీసీసీ ఆపరేటింగ్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. 

కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,94,454 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 5,56,568 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Embed widget