By: ABP Desam | Updated at : 06 Mar 2022 11:05 AM (IST)
పీఆర్సీ నివేదిక వచ్చేసింది
Ashutosh Mishras 11th PRC report: ఎట్టకేలకు పీఆర్సీ నివేదిక రిలీజ్ అయ్యింది. ఎప్పటి నుండో ఉద్యోగ సంఘాలన్నీ ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదికను ఏపీ సర్కారు అర్దరాత్రి సైలెంట్ గా రిలీజ్ చేసింది. ఇటీవల ఉద్యోగ సంఘాలు ఆందోళన నేపథ్యంలో పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయటం కూడా ఒక ప్రదాన డిమాండ్ గా ప్రభుత్వం ముందు ఉంచారు. ఉద్యోగులతో జరిపిన చర్చల్లో పీఆర్సీ నివేదికను విడుదల చేసేందుకు ప్రభుత్వం నుండి హామి వచ్చింది. దీంతో కాస్త ఆలస్యంగా అయినా పీఆర్సీ నివేదికను సర్కార్ బయటపెట్టింది.
నివేదిక అమలుచేసినా రూ.3,181 కోట్ల భారమే
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలో అశుతోష్ మిశ్ర కమిటీ (Ashutosh Mishra Committee 11th PRC Report) చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. మిశ్రా కమిటి యథాతథంగా అమలులోకి తెస్తే, ప్రభుత్వ ఖజానా పై ఏడాదికి రూ.3,181 కోట్ల భారం పడుతుందని కమిటి అభిప్రాయపడింది. ఉద్యోగులకు 27% ఫిట్మెంట్ ఇస్తూ, ఇప్పుడున్న ఇంటి అద్దెను ఎమాత్రం తగ్గించకుండా, సీసీఏని కొనసాగించటంతో పాటుగా, మరి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ చేసిన సిఫారసుల్ని పూర్తిగా అమలు చేసినప్పటికి, ఖజానా పై పడే అదనపు ఆర్థిక భారం 3,181 కోట్లు అవుతుందని కమిటీ స్పష్టం చేసింది.
ఇప్పటి వరకూ ఉన్న ఇంటి అద్దె భత్యాల్ని కొనసాగిస్తూ. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పని చేసే వారికి 22% హెచ్ ఆర్ఎ ఇవ్వాలంటూ కొత్త కేటగిరీని కూడ రిపోర్ట్ లో కమిటి సూచించింది. ఫిట్మెంట్, హెచ్ఎస్ఏ వంటివాటిని ఉద్యోగులకు ఖరారు చేసిన తరువాత కమిటి రిపోర్ట్ ను ప్రభుత్వం తాపీగా వెబ్ సైట్ లో వెల్లడించింది.ఎపీ సర్కారు అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను యథాతథంగా అమలు చేయకుండా,ప్రత్యామ్నాయంగా సీఎస్ ఆధ్వర్యంలో కమిటీని నియమించి, కమిటీ సిఫారసుల ఆధారంగా ఉద్యోగులకు ఫిట్మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించింది. హెచ్ఎస్ఏ కూడా తగ్గించారు.
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం
Breaking News Telugu Live Updates: డ్రైవర్కు ఫిట్స్ - డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన పెళ్లి కారు
IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !
Har Ghar Tiranga: జాతీయ జెండా పాడైతే ఎలా డిస్పోస్ చేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!
Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?
VLC Media Player Ban: వీఎల్సీ మీడియా యూజర్లకు బ్యాడ్ న్యూస్