అన్వేషించండి

AP Sarpanch Elections : టీడీపీ వర్సెస్ వైసీపీ - ఏపీ పంచాయతీ ఉపఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తత !

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.

AP Sarpanch Elections : ఏపీలో  35 గ్రామ  సర్పంచ్‌, 245 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది.  మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌   అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. చిన్న పంచాయతీల ఉపఎన్నికలే అయినా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పింది.  

అనంతపురం జిల్లా నార్పలలో ఎనిమిదవ వార్డు ఉప ఎన్నికలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.  ఒక వార్డ్‌ పోలింగుకు డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అస్సార్‌ భాష, రాప్తాడు, నార్పల ఎస్సైలు, మరో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎనిమిదవ వార్డులో మధ్యాహ్నం ఒంటి గంటకి పోలింగ్‌ ముగిసింది.  ఆ తర్వాత రెండు గంటల నుంచి వార్డు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. 
 
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు.. టీటీడీపీ  కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.  ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు ఆధ్వర్యంలో రిగ్గింగ్‌ జరుగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.  

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచి ఉపఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడుగురు టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి ఇన్‌ఛార్జిని వదిలి తమను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బప్పడంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.                         

ఓటమి భయంతో సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ  అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమా ఆరోపించారు.  దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండచూసుకునే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారన్నారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఒక రూలు - ప్రతిపక్షానికి ఒక రూలా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమన్నారు. వీరమ్మకుంటలో చోటుచేసుకున్న ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.                           

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
AP Cabinet Meeting: పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
పదికి పైగా అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget