By: ABP Desam | Updated at : 28 Nov 2022 04:08 PM (IST)
మార్గదర్శి అడిగిన వివరాలు ఇవ్వడం లేదన్న అధికారులు
Margadarsi Issue : మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అనేక రకాల అవకతవకలు గుర్తించామని.. ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ ప్రకటించారు. మార్గదర్శిలో డబ్బుకి భద్రత ఉందా లేదా అనే సందేహం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత స్టాట్యూటరీ డాక్యుమెంట్లు ఫైల్ చేయలేదన్నారు. అందుకే మార్గదర్శి ఆర్థికస్థితిపై అనుమానాలున్నాయన్నారు. ప్రతి చిట్ వివరాలు ఇస్తేనే వాస్తవం తెలుస్తుందని..కానీ పూర్తి వివరాలు ఇవ్వడం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఒక చిట్‌కు సంబంధించిన డబ్బును ఇతర వ్యాపారులకు వాడకూడదన్నారు.
చిట్‌ఫండ్ నగదును ఇతర వ్యాపారాలకు మళ్లించారన్న ఐజీ
మార్గదర్శి చిట్ ఫండ్ కు చెందిన నగదును.. ఉషోదయ, ఉషాకిరణ్ సంస్థల్లో పెట్టినట్టు ఆధారాలు గుర్తించామని రామకృష్ణ తెలిపారు. మార్గదర్శి ప్రజలను చీట్ చేసినట్టుగానే పరిగణించాలన్నారు. సమాచారం కోసం అడిగితే సహకరించడం లేదు సహకరించకపోగా మేం దుర్భాషలాడామని ఆరోపిస్తున్నారని విమర్శించారు. చాలా రకాలుగా అక్రమాలు పాల్పడినందున చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారం రోజుల్లో షోకాజ్ నోటీసులు ఇస్తామని ప్రకటించారు. మార్గదర్శి అకౌంట్ల నిర్వహణ సక్రమంగా లేనందున స్పెషల్ ఆడిట్ చేయాలని ఆదేశించామన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు ఇస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లోనూ తనిఖీలు చేస్తామన్న ఐజీ
తెలంగాణ అధికారుల సహకారంతో హైదరాబాద్ సంస్థలో తనిఖీలు చేస్తామని రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వానికి ఏ సంస్థపైనా వివక్ష ఉండదన్నారు. 2018లో కపిల్‌చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకున్నామన్నారు. 2022 వరకు కపిల్ చిట్‌ఫండ్స్‌కు కొత్త చిట్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. 2018లో కూడా మార్గదర్శి బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఐజీ చెప్పారు. ఆ రోజే సెకండ్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఈ రోజుకి కూడా మార్గదర్శి సెకండ్ అకౌండ్ వివరాలు ఇవ్వలేదన్నారు. అందుకే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేసిన అధికారులు
ఇటీవల రెండు వారాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సోదాలు చేసిన సంస్థల్లో మార్గదర్శి, శ్రీరామ్, కపిల్ చిట్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన లావాదేవీలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. అవకవతకలు గుర్తించిన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన ఏపీ ప్రభుత్వం
మార్గదర్శి చిట్ ఫండ్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే వాదనను సుప్రీంకోర్టులో వినిపించింది. మార్గదర్శి కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అన్ని పిటిషన్లపై తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీన జరగనుంది.
Breaking News Live Telugu Updates: రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
AP RCET: ఫిబ్రవరి 9 నుంచి 'ఏపీఆర్‌సెట్' రెండో విడత కౌన్సెలింగ్! సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల, Feb 22 నుండి 28 వరకు - ఇలా బుక్ చేస్కోండి
Tirumala News: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరుడికి ఏ నైవేద్యం సమర్పిస్తారంటే?
YSRCP Politics : జగనన్నకు చెప్పుకుంటే రాత మరిపోతుందా ? కొత్త ప్రోగ్రాంపై వైఎస్ఆర్సీపీ ఆశలు నెరవేరుతాయా ?
Balakrishna - Shiva Rajkumar : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్లో శివ రాజ్ కుమార్
Writer Padmabhushan: మహిళలకు ‘రైటర్ పద్మభూషణ్’ బంపర్ ఆఫర్ - ఈ ఒక్కరోజే ఛాన్స్!
Sidharth- Kiara Wedding Pics: అట్టహాసంగా సిద్ధార్థ్, కియారా వివాహ వేడుక