Dharmana Prasada Rao: అందుకే వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత- విశాఖే అసలైన రాజధాని: ధర్మాన
Dharmana Prasada Rao: విశాఖే ఏపీకి అసలైన రాజధాని అని మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. సంస్కరణలను చేయని వారిని నిందించాల్సి పోయి సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
Dharmana Prasada Rao: సంస్కరణలు చేసే ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని.... అది ప్రభుత్వాల తప్పుుకాదని... అర్థం చేసుకోని వారి తప్పని కామెంట్ చేశారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అందుకే తమ ప్రభుత్వంపై కూడా అలాంటి వ్యతిరేకత ఉందన్నారు.
శ్రీకాకుళం కార్పొరేషన్‌లో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన.. రాజధాని అంశంపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. సంస్కరణలు చేసే వారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని, అందుకే ప్రజల ఆమోదం రాదని అన్నారు. సంస్కరణలను అర్దం చేసుకోలేకపోవడం కారణంగా తమ ప్రభుత్వంపై ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అంటూ చెప్పుకొచ్చారు. సంస్కరణలను చేయని వారిని నిందించాల్సింది పోయి, సంస్కరణలు చేసే వారిపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక పెద్ద ప్రాజెక్టులు తెచ్చామని, బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, మూలపేటలో పోర్టుకు డిసెంబర్ లో శంకుస్థాపన చేస్తామన్నారు.
విశాఖ ఉద్యమం కోసం రాజీనామా చేస్తా..
తెలంగాణలో రెండు సార్లు ఉద్యమం వచ్చిందని మంత్రి ధర్మాన ప్రసాద రావు గుర్తు చేశారు. 1969లో ఒకసారి వెనుకుబాటులో ఉన్నామని చేయగా, రెండోసారి 2000 సంవత్సరంలో అంతా మనదే అభివృద్ది చేద్దాం అనే స్వార్దంతో ఉద్యమం చేశారన్నారు. 75 ఏళ్ల రాష్ట్ర సంపదని, సంస్థలను హైదరాబాద్ లో పెట్టామని అందుకే వారికి ఆశ కలగిందన్నారు. అమరావతికి డబ్బులు పెట్టాక వారు పొమ్మంటే.. ఏం చేస్తామని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. విశాఖ ఉద్యమం కోసం రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని.. అదే విషయాన్ని పార్టీ అధినేతకు కూడా చెప్పానని తెలిపారు. విశాఖ సెంట్రల్లో లేదని.. జడ్డి మాటలు మాట్లాడుతున్నారన్నారు. చెన్నై, బోంబాయి, కలకత్తా... రాష్ట్రాల్లో సెంట్రల్ లో ఉన్నాయా అని అడిగారు.
విశాఖలో 500 ఎకరాల్లో క్యాపిటల్ కట్టేస్తారు..
క్యాపిటల్ వస్తే.. ఇన్వెస్టిమెంట్ వస్తుందని, ఉపాధి వస్తుందన్నారు. రాజధానికి విశాఖే అన్ని విధాలుగా అర్హత ఉందని తెలిపారు. క్యాపిటల్ కి 500 ఏకరాలు చాలని.. విశాఖలో 500 ఎకరాల్లో క్యాపిటల్ కట్టేస్తారని పేర్కొన్నారు. అన్ని కనక్టివీటిలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఏవర్నైనా ఆదరించే గుణం, సంస్కారం విశాఖవాసులుకు ఉందని తెలిపారు. మూడు రాజధానులు అంటూ హేళన చేస్తున్నారని పేర్కన్నారు. విశాఖ మెయిన్ రాజధానిగా ఉంటుందని, హైకోర్టు పనుల కోసం కర్నూలు వెళతారని తెలిపారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతికి సభా సమయంలో మాత్రమే వెళతారని మంత్రి ధర్మాన వివరించారు.
మూడు రాజధానుల ఆవశ్యకత తెలుసుకోండి..
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని పెట్టాలని, గుంటూరులో హైకోర్టు పెట్టాలని, అదేవిధంగా విశాఖలో ఆంధ్రావర్శిటీని ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి ధర్మాన గుర్తుచేశారు. 80 ఏళ్ల కిందటే ఇదంతా జరిగిందన్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో.. కటక్ లో హైకోర్టు ఉంది, భువనేశ్వర్ లో క్యాపిటల్ ఉందని తెలిపారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కూడా పరిపాలన వికేంద్రీకరణ ఉందని వివరించారు.
అభివృద్ధిలో హెచ్చు తగ్గులు లేకుండా అన్ని ప్రాంతాలకూ సమానంగా పంచాలన్న రాజ్యాంగం చెప్తుంటే... ఆ సూత్రాన్ని టీడీపీ ప్రభుత్వం పాటించలేదని అన్నారు. తమకు నచ్చినట్లుగా అమరావతిని రాజధాని చేస్తున్నట్లు ప్రకటించి ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల ఏర్పాటు విషయమై కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చి.. పరిపాలన వికేంద్రీకరణకు ఉన్న ఆవశ్యకతను వివరించిందన్నారు. ఆ విధంగా విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని భావించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మంత్రి ధర్మాన తెలిపారు.