అన్వేషించండి

AP Lands Resurvey : ఏపీలో సమగ్ర భూ రీసర్వే, 2,149 గ్రామాల్లో డ్రోన్ల సాయంతో సర్వే పూర్తి

AP Lands Resurvey : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకూ రెండు వేలకు పైగా గ్రామాల్లో డ్రోన్ల సాయంతో సర్వే పూర్తి చేశారు. అయితే భూ రీసర్వేకు కొత్తగా మరో 52 డ్రోన్లు వినియోగించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది.

AP Lands Resurvey : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వేకు అత్యాధునిక సాంకేతికను వినియోగించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే నిర్వహిస్తున్నట్టు కమిటీ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా  త్వరలో 172 డ్రోన్లు సమకూరుస్తామని మంత్రులు తెలిపారు. ఇప్పటివరకూ 2,149 గ్రామాల్లో డ్రోన్ల సాయంతో సర్వే పూర్తి చేశామని వివరించారు. భూసర్వే ప్రక్రియపై మంత్రుల కమిటీ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించింది.

భూ వివాదాల పరిష్కారానికి 

ఈ సమావేశంలో భూసర్వే ప్రక్రియపై అధికారులు మంత్రులకు వివరాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వ్యాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు కమిటీకి తెలిపారు. ప్రజల నుంచి 9,283 వినతలు వచ్చాయని, వాటిల్లో 8,935 సమస్యలు పరిష్కరించామన్నారు. సమగ్ర భూసర్వే ప్రక్రియలో 18,487 సర్వే రాళ్లను పాతి సరిహద్దులు నిర్ణయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో 5,548.90 చ.కి.మీ. పరిధిలో 30 లక్షల నిర్మాణాలు ఉన్నాయన్నారు. దీంతో పాటు 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటితో సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తు్న్నట్లు మంత్రుల కమిటీకి తెలిపారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా ఈ సర్వే పరిష్కారాన్ని చూపుతుందన్నారు. గ్రామీణ, పట్టణాల్లో నివాసాలు, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ సర్వే ద్వారా నిర్థారిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. 

వందేళ్ల భూ రికార్డులు ప్రక్షాళన చేసేందుకు రీ సర్వే 

ఆంధ్రప్రదేశ్ లో వందేళ్ల భూముల రికార్డులు తిరగరాసేందుకు సమగ్ర భూ రీసర్వే చేస్తోంది ప్రభుత్వం. భూ వివాదాలకు పరిష్కరించేందుకు సరిహద్దులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుటుంది. ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ, డ్రోన్లు సైతం వినియోగిస్తోంది. ఏడాదిగా సాగుతున్న భూముల రీసర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా గ్రామాల్లో పూర్తి సర్వే చేశారు. ేేమిగిలిన గ్రామాల్లో వేగంగా సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు. గతేడాది 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం అయింది. ఆ తర్వాత మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్‌-13 నోటిఫికేషన్లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఇంకా 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయింది. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు అధికారులు జారీ చేయనున్నారు. డ్రోన్ల సాయంతో రెండు వేలకు పైగా సర్వే నిర్వహించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Balakrishna : టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
టెక్నిక్ పెరిగినా సినిమాలు లేట్... థియేటర్స్‌కు తాళాలు - గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య రియాక్షన్
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget