AP High Court: పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక తీర్పు... నిర్మాణాలు ఆపాలని కీలక ఆదేశాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టవద్దని తుది తీర్పు వెలువరించింది.
నవరత్నాలు కింద పేదలందరికీ ఇళ్ల పథకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును హైకోర్టు తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టులో 128 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ పాలనా నిర్ణయాలు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు తప్పక జోక్యం చేసుకుంటాయని తెలిపింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన 3 జీవోల్లోని పలు నిబంధనలను కొట్టివేసింది.
Also Read: 12 శాతం వడ్డీ - 4 వారాల గడువు.. బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశం !
ఇళ్ల కేటాయింపునకు వ్యతిరేకం కాదు
ప్రభుత్వ కేటాయించిన సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపడితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హైకోర్టు తెలిపింది. అంతే కాక అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు సంబంధించే ప్రమాదముందని పేర్కొంది. ఈ విషయాలను పరిశీలించకుండా ఇళ్లు కట్టుకోవాలని బలవంతం చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. పేదలకు ఇళ్ల కేటాయింపునకు వ్యతిరేకం కాదని ధర్మాసనం పేర్కొంది. మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్ల కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ, గృహనిర్మాణం, పర్యావరణ శాఖలోని నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక నెలరోజుల్లో ఇవ్వాలని సూచించింది. ఈ నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి అప్పుడు గృహనిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read: టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..
Also Read: "ఎయిడెడ్" స్వాధీనానికి బెదిరింపులు .. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం !
Also Read: కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి