అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

AP HighCourt : "ఎయిడెడ్‌" స్వాధీనానికి బెదిరింపులు .. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం !

ప్రభుత్వానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను స్వాధీనం చేయాల్సిందేనని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యా సంస్థల స్వాధీన నిర్ణయం వివాదాస్పదమవుతోంది. స్వచ్చంగా ప్రభుత్వానికి అప్పగించే వారి వద్ద నుండి కాకుండా బలవంతంగా బెదిరించి మరీ ఎయిడెడ్ విద్యా సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వ తీరు అభ్యంతరకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ విద్యాసంస్థల అసోసియేషన్లు పిటిషన్ దాఖలు చేశాయి. ఎయిడెడ్‌ విద్యాసంస్థల అంగీకారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎన్‌.సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read : పరిషత్ పీఠాల కోసం రచ్చ రచ్చ - పలు చోట్ల వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ ఆందోళన ! 

ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్వచ్చందంగా అప్పగించే వారు అప్పగిచాలని ఉందని కానీ అధికారుల ప్రోద్భలంతో బెదిరింపులకు దిగి బలవంతంగా అంగీకారాన్ని తీసుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు అధికారులకు కడప డీఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ కాపీని న్యాయమూర్తులకు పిటిషనర్ తరపు న్యాయవాది అందించారు. అందులో హెచ్చరికల్లాంటి సూచనలు ఉండటంతో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విషయం కనపడుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. 

Also Read : కాంగ్రెస్‌లో ఎవరూ హీరోలు కాదు.. రేవంత్‌పై ఊగిపోయిన జగ్గారెడ్డి !

ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మరో విధంగా జరగుతున్నట్లు తెలుస్తోందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. ఈ నెల 29న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ధర్మాసనం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ 29వ తేదీకి వాయిదా వేసింది.  ఎయిడెడ్ విద్యాసంస్థల భవనాలు, భూములు సహా యాజమాన్యాలు పూర్తిగా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహించాలని లేకపోతే లేదంటే యాజమాన్యాలు ప్రైవేటుగా నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ప్రభుత్వానికి అప్పగించకపోతే గ్రాంటును నిలిపివేస్తారు. 

Also Read : బీసీ సంక్షేమం కిందకు బ్రాహ్మణ కార్పొరేషన్ ! ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి ? విమర్శలు ఎందుకు వస్తున్నాయి ?

ఎయిడెడ్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటంతో చాలా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ ఎయిడ్ లేకపోవడంతో ఆయా విద్యా సంస్థలు నడవడం కూడా కష్టంగా మారింది. విజయవాడలోని మాంటిస్సోరి వంటి స్కూళ్లు కూడా మూత వేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇది విద్యార్థులకు అనేక కష్టాలు తెచ్చి పెడుతోంది. 

Watch Video : మా ఎన్నికల కోసం ప్యానెళ్ళు సిద్ధం.. మరి గెలుపు ఎవరి వైపు?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
Embed widget