By: ABP Desam | Updated at : 21 Jan 2022 05:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ హైకోర్టు(ఫైల్ ఫొటో)
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాల్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. గతంలో ప్రత్యేక ఆహ్వానితుల జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. చట్టంలో సవరణ తీసుకువచ్చి త్వరలో ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వ న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితుల జీవోలపై పిటీషనర్ తరపు న్యాయవాదులు యలమంజుల బాలాజీ, అశ్వినీ కుమార్ అభ్యంతరం తెలిపారు. 52 మందితో టీటీడీ పాలక మండలి నియామకం ఏమిటని ప్రశ్నించారు. జంబో కేబినెట్ ను తలపిస్తుందని న్యాయవాది బాలాజీ వాదించారు. జీవోలను రద్దు చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. చట్ట సవరణకు సంబంధించిన వివరాలు కోర్టుకు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది నాలుగు వారాలు సమయం కోరారు. ఈ పిటిషనపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read: 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
జీవోలను కొట్టేసిన హైకోర్టు
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు గతంలో కొట్టేసింది. పాలకమండలి నియామకంపైనా హైకోర్టు అప్పట్లో సీరియస్ కామెంట్స్ చేసింది. నిబంధనలకు విరుద్దంగా టీటీడీ బోర్డు సభ్యుల్ని నియమించారని, టీటీడీ స్వతంత్రతను దెబ్బ తీసేలా జీవోలు ఉన్నాయని కోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు జరిగాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు జీవోను సస్పెండ్ చేసింది. టీటీడీ పాలక మండలి నియామకానికి సంబంధించి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?
బీజేపీ నేత హైకోర్టులో పిల్
టీటీడీ పాలకమండలిలో 28 మంది సభ్యులను నియమిస్తూ ఏపీ సర్కార్ జీవో నెం. 245 తీసుకొచ్చింది. అయితే మరో 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియమిస్తూ 568, 569 జీవోలు తెచ్చింది. ఈ జీవోలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. క్రిమినల్ కేసులు, అధికార పార్టీతో రాజకీయ సంబంధాలు ఉన్న వ్యక్తులను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారని ఆరోపించారు. ఈ పిల్‌ను హైకోర్టు విచారణ జరుగుతుంది.
Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే.
Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !
Petrol-Diesel Price, 26 June: నేడు చాలాచోట్ల నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - మీ ప్రాంతంలో ధరలు ఇలా
Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ
Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?
Vishnu Kumar Raju: బీజేపీ హై కమాండ్‌కు అంతుబట్టని మాజీ ఎమ్మెల్యే తీరు, కానీ వీర విధేయతలో ఆయనకు సాటిలేరు
TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే !
Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో పాము కలకలం, పరుగులు తీసిన సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్!
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!