AP High Court: ఆ సినిమా థియేటర్‌ను తక్షణమే తెరవండి: ఎమ్మార్వోకు ఏపీ హైకోర్టు ఆదేశాలు
తాళం వేసిన థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు ఇచ్చారు.
MRO Locked Cinema Theater in Sompeta: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే కారణంగా ఓ సినిమా థియేటర్‌కు ఎమ్మార్వో తాళం వేశారు. ఎమ్మార్వో థియేటర్‌కు తాళం వేయడం స్థానికంగా వివాదానికి కారణమైంది. ఆ తహసీల్దార్ చర్యను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. థియేటర్‌కు తాళం వేసే అధికారం మీకు ఎక్కడికి అని ప్రశ్నించింది. లైసెన్స్ జారీ చేసే జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే ఆ అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. జాయింట్ కలెక్టర్ సైతం ఎమ్మార్వోకు ఆ అధికారం ఇవ్వలేదని ధర్మాసనం గుర్తుచేసింది.
తాళం వేసిన థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఏపీ హైకోర్టు ఆదేశించింది. లైసెన్స్ రెన్యూవల్ విషయం అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సినిమాలు రన్ చేసుకోవచ్చునని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..
నిబంధనలకు విరుద్ధంగా థియేటర్ నిర్వహిస్తున్నారని విజయనగరం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్‌ను స్థానిక ఎమ్మార్వో గుర్తించారు. థియేటర్‌కు ఆయన తాళం వేశారు. తమ థియేటర్‌ను మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మేనేజింగ్ పార్ట్‌నర్ ఎస్ శంకర్ రావు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ శ్రీనివాస మహల్‌కు తాళం వేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ పబ్లిస్ ప్రాసిక్యూటర్ వాదనలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. థియేటర్‌కు తాళం వేసే అధికారం మీకు లేదని పేర్కొంటూ.. తాళాన్ని తీయాలని ఎమ్మార్వోను ఏపీ హైకోర్టు ఆదేశించింది.
సీఎం జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి
ఏపీలో కొనసాగుతున్న సినిమా టికెట్ ధరల వివాదంపై చర్చించేందుకు ఈ నెల పదో తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి భేటీ కానున్నారు. టాలీవుడ్ నుంచి కొంత మంది బృందం చిరంజీవి నేతృత్వంలో వస్తుందని భావిస్తున్నారు. గత సమావేశంలో చిరంజీవి ఒక్కరే పాల్గొన్నారు. దీని వల్ల అది వ్యక్తిగత సమావేశమని ప్రచారం అయింది. ఈ సారి ఎలాంటి అపోహలు లేకుండా టాలీవుడ్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల ప్రతినిధులతో కలిసి చిరంజీవి తాడేపల్లికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. టికెట్ల అంశంపై చర్చించేందుకు ఈ 10న సమావేశం జరగనందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: పదో తేదీన జగన్‌తో చిరంజీవి బృందం భేటీ.. టిక్కెట్ రేట్స్ సహా టాలీవుడ్ సమస్యలపై చర్చ !
Also Read: Chalo Collectorate: ఛలో విజయవాడ స్ఫూర్తితో ఈ నెల 10న ఛలో కలెక్టరేట్‌కు విద్యార్థి సంఘాల పిలుపు