AP Highcourt On Volunteers : వాళ్లు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు . సంక్షేమ పథకాల లబ్దిదారులను వాలంటీర్లు ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించింది.
సంక్షేమ పథకాల లబ్దిదారులను వాలంటీర్లు ఎంపిక చేయడం ఏమిటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది . రాజకీయ కక్షతో తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా వాలంటీర్లు నిలిపివేశారని గారపాడు గ్రామానికి చెందిన 26 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తామంతా పథకానికి అర్హులమేనని వారు వాదిస్తున్నారు. కేవలం వాలంటీర్లు రాజకీయ కారణాలతోనే తమకు పథకం అందకుండా చేశారన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. విచారణలో వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పలు రకాల సందేహాలు వ్యక్తం చేసింది.
త్యాగాలకు సిద్ధమన్న చంద్రబాబు- పవన్‌కు సూచనలు పంపించారా ?
వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కదా ? వారికి డబ్బులెలా ఇస్తారు? అని హైకోర్టు ప్రశ్నించింది. పెపెన్షన్‌దారుల సొమ్ముతో వలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రిక వార్తలను హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తావించారు. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. లబ్దిదారులను వాలంటీర్లు ఎంపిక చేస్తూంటే సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని హైకోర్టు పశ్నించింది. ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ఎపి ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారి చేసింది.
రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలతో ఏపీలో దుమారం! తక్షణం మంత్రి క్షమాపణకు టీడీపీ డిమాండ్
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమించింది. ప్రభుత్వ పథకాలు సహా మొత్తం వారి ద్వారానే ఆ యాభై ఇళ్లకు చేరేలా ఏర్పాట్లు చేసింది. చివరికి లబ్దిదారులు కూడా వారినే సంప్రదించి.. తమ అర్హతను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఎంపికలో తమకూ ప్రమేయం లేదని. ఎమ్మెల్యే కంటే వాలంటీర్‌కే ప్రాధాన్యం ఉందని వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరిస్తున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయి.
చంద్రబాబు పిలుపుపై జనసేన స్పందన క్లియర్ - నాదెండ్ల ఏం చెప్పారంటే ?
అయితే ఇప్పటి వరకూ ఈ వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టులో ఎలాంటి వ్యతిరేక పిటిషన్లు దాఖలు కాలేదు. పథకాలు అందని లబ్దిదారులు వాలంటీర్ల వల్లే తమకు అన్యాయం జరిగిందని చెబుతూ కోర్టుకెళ్లడంతో ఇప్పుడు వారి విషయం హైలెట్ అవుతోంది. వాలంటీర్లకు అంత అధికారం ఎలా ఇచ్చారో ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు చెప్పాల్సి ఉంది.