అన్వేషించండి

AP High Court : శిరోముండనం కేసులో నిందితుల క్వాష్ పిటిషన్లు కొట్టివేత - ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

AP High Court : శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల క్వాష్ పిటిషన్ కొట్టి వేసి విచారణకు అనుమతించింది.

AP High Court :  ఈస్ట్ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నాడనే నెపంతో అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లోనే దళిత యువకుడికి శిరోమండనం చేసిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.  నిందితులపై పెట్టిన కేసులో తదుపరి విచారణ జరపకుండా 2020 లో రాష్ట్ర హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టి వేస్తూ  కీలక తీర్పు ఇచ్చింది. విచారణ పూర్తి కాకుండా నిందితులు వేసిన క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలను అనుసరించి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరిన న్యాయవాదులు. వాదనలతో ఏకీభవించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  

వరప్రసాద్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వైసీపీ నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ప్రసాద్ ఆరోపించారు. ఇక ఈ కేసుపై బాధితుడి ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం కూడా స్పందించింది. ఈ కేసును తక్షణం విచారించేలా ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఆదేశాలిచ్చారు.                      

క్సలైట్‌గా మారేందుకు అవకాశమివ్వాలంటూ గతంలో బాధితుడు ప్రసాద్‌ రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఏపీ జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్‌బాబుకు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. అనంతరం జనార్దనబాబును తాను సంప్రదించినా స్పందనలేదని బాధితుడు ప్రసాద్‌ వాపోయాడు. ఈ నేపథ్యంలో కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ తాజాగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కేసులో ్ప్పట్లోనే  ట్రైనీ ఎస్సై ఫిరోజ్‌షాను   అరెస్టు చేశారు. అంతేకాదు అతడితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై నా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ కేసులో ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.   ఎస్సీ యువకుడు ఇండుగుబిల్లి ప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై ఫిరోజ్‌ సమక్షంలోనే తీవ్రంగా కొట్టి, ట్రిమ్మర్‌తో శిరోముండనం చేశారు.

ఈ కేసులో చర్యలు తీసుకోకపోవడంతో దళిత వర్గాలు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం  చేశాయి. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు హైకోర్టు నిందితుల క్వాష్ పిటిషన్లు కొట్టి వేసి విచారణకు అంగీకారం తెలుపడంతో దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.                                                                               

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget