అన్వేషించండి

AP High Court : సింగిల్ జడ్జి ఆదేశాలు ఎత్తి వేయలేం - విశాఖకు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP High Court : విశాఖకు కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తి వేయలేని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

Amaravati Case :    విశాఖకు కార్యాలయాల తరలింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను లిఫ్ట్ చేయలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.   రాజధాని కార్యాలయాల తరలింపు పై సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని ధర్మానసం పేర్కొంది. సింగిల్ జడ్జి ఆదేశాలను తాము లిఫ్ట్ చేయలేమన్న బెంచ్.. మీరే త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని కోరుతున్నట్లు వెల్లడించింది. ఈ అప్పీల్ ను ఎవరు వినాలి అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పింది.  ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్ని కార్యాలయాలు, ఎంతమంది అధికారులు విశాఖకు తరలిస్తారు. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు., ఎంత మంది అధికారులు వెళ్తున్నారు అనే అంశంపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సమీక్షల పేరుతో కార్యాలయాల తరలింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో తరలిస్తున్నారని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల కిందట హైకోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం, పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపింది. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాల తరలించబోమని వైసీపీ సర్కార్ న్యాయస్థానానికి తెలిపింది. తర్వాత ప్రభుత్వం  లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.  ఈ పిటిషన్లను సీజే బెంచ్‌ ఎదుట ఉంచాలని రిజిస్ట్రీకి సూచించింది. పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కార్యాలయాలను తరలింపులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చింది. రాజధాని తరలింపుపై త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చే వరకు, కార్యాలయాలను తరలించబోమని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపింది. ఇప్పుడు ఆదేశాలు కొనసాగుతాయి. 

చివరి దశకు నిర్మాణాలు

రుషికొండపై 4 బ్లాకుల్లో 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ నివాసంతో పాటు కార్యాలయం ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌ను అందంగా తీర్చిదిద్దారు.  కళింగ బ్లాక్ 5,753 చదరపు మీటర్లలో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ,   తర్వాత దాన్ని 7,266 చదరపు మీటర్లకు పెంచారు. ముఖ్యమంత్రి జగన్, కుటుంబంతో కలిసి ఉండటానికి విజయనగర బ్లాక్‌ను సిద్ధం చేశారు.  ఈ భవనం నుంచి సముద్రం అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. మొదట ఈ బ్లాక్‌ను 5,828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. తర్వాత 3,764 చదరపు మీటర్లకు తగ్గించారు. ఇందులోనే ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూమ్స్ ను సిద్ధం చేశారు. 1,821 చ.మీ.లతో వేంగి బ్లాక్, 690 చ.మీ.లలో గజపతి బ్లాక్‌ లను రెడీ చేశారు. రుషికొండ చుట్టూ 3 చెక్‌పోస్టులు పెట్టారు. 24 గంటలు పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో హెలీ టూరిజం కోసం హెలిప్యాడ్‌ ను నిర్మించారు. విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్‌ వినియోగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

35 శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయింపు

35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భవనాల వినియోగంపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు  గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు కూడా  జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను రిషికొండ మిలీనియం టవర్స్‌లో గుర్తించింది.  మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు.  ముఖ్యమంత్రి జగన్, మంత్రులు విశాఖలో సమీక్షలు నిర్వహించే సమయంలో, వారంతా మిలినియం టవర్స్ లోని ఏ, బీ భవనాలను వినియోగించుకునేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీ రాజధానిగా మారబోతోందని స్యయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తాను కూడా అక్కడికి మారుతున్నట్లుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ సన్నాహక సదస్సులో వెల్లడించారు. పెట్టుబడిదారులు విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget