Dasara Celebrations 2021: దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఉత్సవాలు అనుమతిస్తున్నట్లు ప్రకటన...

దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటన జారీచేశారు.

FOLLOW US: 

దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శరన్నవరాత్రుల ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ ప్రకటన జారీ చేశారు. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రీపై జరగనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు అనుమతి ఇవ్వాలని గట్టిగానే పోరాడాయి. చివరకి హైకోర్టు జోక్యం పరిమిత సంఖ్యలో భక్తులు, ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటుచేసుకోవచ్చని తెలిపింది. 

దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు

దుష్టసంహారంతో ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం అని చెబుతారు పండితులు. ఏటా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఈ నెల 7 నుంచి 15వ దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Also Read:  బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి దర్శనం.. వెనుకబడిన వర్గాల భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. రోజుకు ఎంతమందికి అవకాశం అంటే..!

ఏ రోజు ఏ అలంకారం

  • అక్టోబరు 7 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
  • అక్టోబరు 8 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.
  • అక్టోబరు 9 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.
  • అక్టోబరు 10 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
  • అక్టోబరు 11 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.
  • అక్టోబరు 12 శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).
  • అక్టోబరు 13 శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).
  • అక్టోబరు 14 శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).
  • అక్టోబరు 15 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

అక్టోబరు 11 సోమవారం శుద్ధ పంచమి, షష్ఠి తిధులు రావడంతో అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆలయ దర్శనవేళలు, టికెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్ సైట్లో సందర్శించవచ్చని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమినాయుడు తెలిపారు. ఈ సారి దసరా ఉత్సవాలలో జగన్మాత దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కుంకుమతోపాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

Also Read: అక్టోబర్ 7నుంచి దసరా ఉత్సవాలు, ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు- దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ, అమ్మవారి డాలర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Oct 2021 03:28 PM (IST) Tags: ap govt Dasara 2021 Dasara celebrations 2021 Indrakiladri Durga festival

సంబంధిత కథనాలు

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

AP Courier Offices: బెజవాడ డ్రగ్స్ ఎఫెక్ట్ - ఏపీలో కొరియ‌ర్ ఆఫీస్‌లపై పోలీసుల నిఘా

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్

Doubts On Subramanyam death Case :సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఎన్నో అనుమానాలు ! వాటిని తీర్చేదెవరు ?

Doubts On Subramanyam death Case :సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి  కేసులో ఎన్నో అనుమానాలు ! వాటిని తీర్చేదెవరు ?

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు

Chandrababu: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికీ ఛాన్స్, ఈసారి 40 శాతం సీట్లు వారికే : చంద్రబాబు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం