అన్వేషించండి

AP PRC: ప్రభుత్వంతో చర్చలు సఫలం, సమ్మె తాత్కాలిక విరమణ : ఉద్యోగ సంఘాలు

ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల చర్చలు కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయని, సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

పీఆర్‌సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీతో మంత్రుల కమిటీ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సచివాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. హెచ్‌ఆర్‌ఏ స్లాబుల విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. దీంతో కొంత ప్రతిష్ఠంభనకు తెరపడింది. మంత్రులతో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ ఆన్‌లైన్‌లో మాట్లాడారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులతో పాటు కొన్ని అంశాలపై ఇరు వర్గాలకు మధ్య అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. మంత్రుల కమిటీతో చర్చలు కొలిక్కి రావడంతో ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకున్నాయి. మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించాయి. రేపు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యే అవకాశం ఉంది.   

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల వాడీవేడిగా సాగిన పీఆర్సీ వివాదం కొలిక్కి వచ్చింది. ఎలాంటి అనుమతి లేకపోయినా అడుగడుగునా ఆంక్షలు పెట్టిన ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్ట్ చేసినా.. చలో విజయవాడ సక్సెస్ అయింది. ఆ విషయాన్ని ముందు ప్రభుత్వం ఊహించలేకపోయింది. కానీ ఊహకందని విధంగా చలో విజయవాడ సూపర్ సక్సెస్ కావడంతో ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచన చేసింది. సీఎం జగన్ అధికారులు, మంత్రుల కమిటీలతో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. వెంటనే సమ్మెను ఆపేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఉద్యోగుల డిమాండ్లలో కొన్నింటికి హామీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన కమిటీతో సమావేశమై పీఆర్సీ ప్రతిపాదనల్లో కొన్ని సవరణలు చేసినట్టు పేర్కొంది. ఉద్యోగులు చెప్పిన అభ్యంతరాలను స్వీకరించి అందులో సాధ్యమయ్యేవాటికి పూర్తి చేస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో చర్చలు విజయవంతంగా ముగిశాయి.

AP PRC: ప్రభుత్వంతో చర్చలు సఫలం, సమ్మె తాత్కాలిక విరమణ : ఉద్యోగ సంఘాలు

మంత్రుల కమిటీతో చర్చలు విజయవంత అవ్వడంతో ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పిలుపు ఇచ్చిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి. ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయని ఆ చర్చలు సఫలమయ్యాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫిట్ మెంట్ మినహా ఇతర విషయాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ కాలపరిమితిని ఐదేళ్లకు తగ్గించడం ఐఆర్ రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ హామీ ఇవ్వడంతో సమ్మె నుంచి వెనక్కి తగ్గాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఫిట్ మెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏం చేయలేమని చేతులెత్తేసినట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు 27 శాతం ఫిట్ మెంట్ అడగగా.. 23 శాతం కన్నా పెంచే అవకాశం లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అలాగే హెచ్ఆర్ఏ 10 శాతం పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.  అయినప్పటికీ ఐఆర్ రికవరీ చేయకపోవడం పీఆర్సీ కాలపరమితి తగ్గించడం, సీపీఎస్ రద్దుపై సానుకూలంగా స్పందించడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని అన్నింటిని ఆలోచించి ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రభుత్వంతో చర్చలు సఫలం

పీఆర్సీ సహా ఇతర డిమాండ్లు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. తమ డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్‌తో చర్చించామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. తాము పెట్టిన 71 డిమాండ్లపై మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మతో చర్చించామన్నారు. త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించామని మంత్రి తెలిపారు. ఉద్యోగ సమస్యలపై సమావేశాలు పెట్టి పరిష్కరిస్తామని బుగ్గన హామీ ఇచ్చారు. ఆందోళన విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని మంత్రి తెలిపారు. 

కరోనా కారణంగా పరిపాలన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి బుగ్గన వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఫ్యామిలీ మెంబరుగా భావిస్తోందని.. టైమ్ బౌండ్ పెట్టుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు అన్నారు.  ఉద్యోగులు లేవనెత్తిన ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని.. ఉద్యోగుల సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ బుధవారం సమావేశం అవుతారని బుగ్గన తెలిపారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో టచ్ లో ఉంటామని.. ఉద్యమంలో ఉన్న తొమ్మిది సంఘాలను ఆందోళన విరమించాలని కోరామని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 

దురుద్దేశంతో సమ్మెకు వెళ్లలేదు 
 
ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దురుద్దేశ్యంతో ఉద్యమానికి వెళ్లలేదని, సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమించామని తెలిపారు. ఆర్ధికేతర సమస్యలు కూడా చాలా కాలం పెండింగులో ఉన్నాయని తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారని బొప్పరాజు వెల్లడించారు. బుధవారం స్వయంగా సీఎస్ సమీర్ శర్మ సమీక్షించనున్నారని ప్రభుత్వ సానుకూల స్పందనతో తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నామని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
ఈ నెల 14న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక భేటీ
AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Municipal Elections 2026 Reservations: ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల
ఏపీలో స్థానిక ఎన్నికలు.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల జాబితా విడుదల

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget