Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
IAS Postings: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Government Postings To IAS Officers Who Came From Telangana: తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్ అధికారులను పోస్టింగులు ఇస్తూ ఆదివారం సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా ఆమ్రపాలిని (Amrapali) నియమించింది. ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జి.వాణిమోహన్‌ను బదిలీ చేసి.. సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను రిలీవ్ చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మరో ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
- టూరిజం ఎండీ, టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలి
- వైద్యారోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ
- జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వాణీమోహన్
- కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్