అన్వేషించండి

AP Flexis Ban : ఫ్లెక్సీలకు ప్రత్యామ్నాయన్ని చూపిస్తున్న ప్రభుత్వం - ఆచరణ సాధ్యం కాదంటున్న ఫ్లెక్స్ ఓనర్స్ !

ఏపీలో ఫ్లెక్సీల బ్యాన్ జనవరి 21 నుంచి అమల్లోకి రానుంది. ప్రత్యామ్నాయం కోసం ప్రభుత్వం వర్క్ షాప్ ఏర్పాటు చేసింది.

 

AP Flexis Ban   :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఫ్లెక్సీలను నిషేధించాలని నిర్ణయించుకుంది.   21 జనవరి, 2023 నుండి నిషేధం అమల్లోకి రానున్నది. ఈ నిర్ణయం గతంలోనే తీసుకుంది. అయితే ఫ్లెక్సీల మీద ఆధారపడిన పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి ఉండటం.. పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోతారని తేలడంతో..  వాయిదా వేసింది. ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలని అనుకుంటోంది. ఇందుకోసం ప్లాస్టిక్ బ్యానర్స్ కు ప్రత్యామ్నాయంగా కాటన్  వస్త్రంపై ముద్రించేందుకు అనుగుణంగా ఉన్న యంత్రాలు, ముద్రించేందు కావలసిన ముడిసరుకులను అందించే పరిశ్రమలు, ఫ్లెక్స్ ప్రింటర్స్ కు అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో  విజయవాడలో ‘ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ బ్యానర్స్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ సదస్సుకు ఫ్లెక్సీల వ్యాపారాలు వందల మంది వచ్చారు. ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా  ఫ్లెక్స్ యంత్రాలను వస్త్రాల పై ముద్రించే యంత్రాలుగా మార్చేందుకు  కలిగే ఇబ్బందులు, అభిప్రాయాలను తెలియజేయాలని  ఫ్లెక్సీ వ్యాపారులను ఉన్నతాధికారులు కోరారు. ప్రభుత్వపరంగా ప్లాస్టిక్ బ్యానర్స్ ప్రింటర్స్ కు ప్రత్యామ్నాయ మార్గాలకు కావలసిన యంత్రాల మార్పునకు సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ ను వినియోగించడం వలన పర్యావరణానికి, మానవాళి మనుగడకు కలిగే నష్టం పెద్దస్థాయిలో ఉంటుందన్నారు. ప్రజలంతా స్వచ్ఛదంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడంలో భాగస్వాములు కావాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదలైన గాలి, నీరు, నేలను అందించాలని  పిలుపునిచ్చారు. 

ఈ సదస్సులో ప్లాస్టిక్ బ్యానర్లకు ప్రత్యామ్నాయంగా కాటన్  వస్త్రంపై ముద్రించేందుకు కావాల్సిన యంత్రాలు, ముడిసరుకులు, ప్రింటింగ్ పరికరాలు వాటి యొక్క పని తీరును ప్రదర్శించారు.  దేశంలోని చెన్నై, కోయంబత్తూరు, తమిళనాడు, హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుండి ఈ యంత్రాలు, ముడిసరుకులను పంపిణీ చేసే పరిశ్రమలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫ్లెక్స్  బ్యానర్స్ అసోసియేషన్ ప్రతినిధులు  ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.  ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇప్పటికప్పుడు కాటన్ వస్త్రాల పై ముద్రణ సాధ్యం కాదని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, ఆచరణకు చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు.ఇప్పటికే ప్రభుత్వం నిషేదాన్ని ప్రకటించినందున  ఈ రంగం పై ఆదారపడిన అనేక మంది రోడ్డున పడ్డారన్నారు. 

క్లాత్ బ్యానర్ పై ముద్రణ కు కావాల్సిన మిషనరీ కొనుగోలుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించాలని ఫ్లెక్స్ ఓనర్స్ డిమాండ్ చేశారు.  బ్యాంకులు ఇప్పుడున్న పరిస్దితుల్లో ఫ్లెక్స్ ప్రింటింగ్ అంటేనే రుణం ఇవ్వమని తెగేసి చెబుతున్నాయన్నారు.  దీంతో పరిశ్రమ పై ఆదారపడిన వారి పరిస్దితి ఆగమ్యగోచరంగా మారింద..  ప్రభుత్వం పూర్తి స్దాయిలో చర్యలు తీసుకుంటేనే.. భవిష్యత్ లో త్వరగా కోలుకోగలమని అన్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాన్ పేరుతో హడావిడిగా నిర్ణయం అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని.. ప్రత్యామ్నాయంగా ఫ్లెక్స్ పరిశ్రమ ను కాపాడేందుకు చర్యలు ఉండాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విదానాలను ఇక్కడ కూడ అమలు చేసేందుకు ప్రయత్నించాలని అన్నారు. మరో వైపున ముడి సరుకు వ్యవహరంలో కూడా ప్రభుత్వం శ్రద్ద చూపించి సబ్సిడీ ఇవ్వాలని కోరారు. అయితే వీరి డిమాండ్లపై ఉన్నతాధికారులు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget