అన్వేషించండి

Grama Volunteers: వాలంటీర్లకు నో ఎలక్షన్ డ్యూటీ - ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Andhrapradesh News: ఏపీలో ఎన్నికల విధులకు వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Government Orders on Volunteer Election Duty: రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం (Ap Government) కీలక ఆదేశాలిచ్చింది. వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు వారిని పూర్తిగా దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి వారిని తక్షణమే తొలగించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగానూ నియమించవద్దని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే ఈసీ మార్గదర్శకాల మేరకు చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ పంపించారు. 

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలన్న సీఈసీ ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమొక్రసీ (CFD) చేసిన విజ్ఞప్తిపై తగు నిర్ణయం తీసుకోవాలని సీఈసీని హైకోర్టు ఆదేశించింది. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంచాలన్న ఉత్తర్వులపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సీఎఫ్ డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం 3 వారాల్లో తగు నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలిచ్చింది.

కాగా, ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఉపయోగించవద్దని.. వారిని పోలింగ్ ఏజెంట్లుగా సైతం అనుమతించొద్దని గతంలోనే సీఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా బీఎల్‌వో (BLO)లుగా పనిచేసిన సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని ఈసీ సూచించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వహించుకోవచ్చునని పేర్కొంటూ.. ఎన్నికల విధుల్లో వారి పాత్రపై క్లారిటీ ఇచ్చింది. సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు అప్పగించవచ్చునని స్పష్టం చేసింది. వీటికి అదనంగా మరే ఎన్నికల విధులను వారికి అప్పగించకూడదని ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ సూచించింది. వాలంటీర్ల విషయంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. ఈసీ ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాల నుంచి సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు వాలంటీర్లను ఎన్నికల విధులకు పూర్తిగా దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే.?

మరోవైపు, నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రాల వారీగా సీఈసీ సమీక్షలు నిర్వహించి అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలిచ్చింది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ తో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Andhra Congress Revanth Reddy : ఏపీ కాంగ్రెస్ రాతను రేవంత్ రెడ్డి మారుస్తారా ? ప్రచారం వల్ల మేలు జరుగుతుందా ? నష్టమా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
'ఓ దశలో రాజకీయాల నుంచి వైదొలగాలనుకున్నా' - నెటిజన్లతో చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2025: ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
ఉత్కంఠకు తెర - ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది, అత్యధిక ధర ఎవరికంటే?
Hyderabad Diwali: దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
దీపావళి సందర్భంగా భాగ్యనగర వాసులకు అలర్ట్ - రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి!
Best Cars Without Waiting Period: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Pirated Content Consumption: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Diwali Celebrations: అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
అక్కడ శ్మశానంలో దీపావళి వేడుకలు - ఎందుకో తెలుసా?
Embed widget