AP Pension New Rules : 50 ఏళ్లు నిండితేనే ఒంటరి మహిళలకు పెన్షన్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం !
ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసును ప్రభుత్వం యాభై ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఇది గ్రామాల్లో 30, పట్టణాల్లో 35 వరకూ ఉంది.
AP Pension New Rules : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ పెన్షన్‌కు అర్హత ఉన్న వయసును ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఒంటరి గ్రామాల్లో 30 ఏళ్ల నుంచి.. పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు యాభై ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే యాభై ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే ఇక నుంచి పెన్షన్ ఇస్తారు. ఈ ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ పదహారో తేదీన విడుదల చేసింది.
ఒక్క రోజులోనే ధియేటర్ల ఖాతాలో కలెక్షన్స్ - ఆన్‌లైన్‌పై ఎగ్జిబిటర్లకు అపోహలొద్దంటున్న ఏపీ ప్రభుత్వం !
తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఒంటరి మహిళ పెన్షన్ పొందాలంటే యాభై ఏళ్లు నిండి ఉండటమే కాదు కచ్చితంగా దారిద్ర్య రేఖ దిగువన ఉండాలని...స్థానికంగా నివసించాలని అలాగే.. ఆధార్ కార్డ్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ ఇతర సామాజిక పించన్ పథకం లో భాగం అయినా పెన్షన్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ఒంటరి మహిళలు అంటే పెళ్లి కాని వాళ్లు, డైవర్స్ తీసుకున్న వాళ్లు, భర్త చనిపోయిన వాళ్లు ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు అయినా 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు . విడాకులు తీసుకున్న వారికీ అంతే. భర్త చనిపోయి ఉంటే గ్రామాల్లో 30 పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లోనూ యాభై ఏళ్లు నిండి ఉండాలని ప్రభుత్వం తేల్చేసింది.
మరోసారి పోలవరానికి కేంద్ర నిపుణుల కమిటీ - ఈ సారైనా క్లారిటీ క్లారిటీ ఇస్తారా ?
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారికి వర్తింప చేస్తే పెద్ద ఎత్తున మహిళలు నష్టపోతారు. అయితే కొత్తగా మంజూరు చేస్తున్న పెన్షన్లకేనా లేకపోతే .. ఇప్పటికీ ఉన్న జాబితాలో కూడా ఈ విధంగా మార్పులు చేస్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ ఉత్తర్వులను అమలుచేసిన తర్వాత యాభైఏళ్ల లోపు ఒంటరి మహిళలకు పెన్షన్లు రాకపోతే... పాత పెన్షనర్లకు కూడా వర్తింప చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది.
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు - సీఎం జగన్ సంతకం !
ఇప్పటికిప్పుడు ఇలా పెన్షన్ల వయసును అనూహ్యంగా పెంచేస్తే లక్షల మంది ఒంటరి మహిళలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వంపై అసంతృప్తికి దారి తీసే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇంకా స్పష్టత రాలేదు.