News
News
X

New liquor policy in AP : మూడేళ్లకు బార్ పాలసీ - మద్యనిషేధం లేనట్లేనని తేల్చిన జగన్ సర్కార్ !

బార్ పాలసీని మూడేళ్లకు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్య నిషేధ ఎన్నికల హామీని నెరవేర్చడం లేదని స్పష్టంగా చెప్పినట్లయింది.

FOLLOW US: 

New  liquor policy in AP : ఏపీలో మూడేళ్ల పాటు అమల్లో ఉండేలా కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటి నుంచి  కొత్త విధానం అమలు  లోకి  రానుంది. ఈ నెలాఖరుతో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బార్  లైసెన్స్ ల గడువును ఆగస్టు వరకూ పొడిగించింది . రాష్ట్రవ్యాప్తంగా 840 బార్ లకు  అనుమతి ఇచ్చింది. మూడు కేటగిరీలుగా ఫీజులు నిర్దారణ అయ్యాయి. 50వేలు, 5 లక్షలు, 5 లక్షల కు పైగా   జనాభా ఉన్న ప్రాంతాలుగా ఫీజులు నిర్దారణ చేస్తూ  ఉత్తర్వులు  ఇచ్చింది  ప్రభుత్వం. 

అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని జగన్ హామీ 

అధికారంలోకి వస్తే  మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు.  బ్రాండెడ్ మద్యం సరఫరా చేయకుండా ఇతర బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ బ్రాండ్లన్నీ జే బ్రాండ్లని వాటిలో విషపదార్థలున్నాయని టీడీపీ నేతలు ారోపణలు చేస్తున్నారు. మద్యనిషేధం చేస్తామని చెప్పి ఇప్పుడుపెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ అంశంపై ప్రభుత్వంఎలాంటిస్పందనవ్యక్తం చేయలేదు. వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ద్యం పైనే   ఆదాయం గ‌డించి ఖ‌జానాను నింపుకునేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా తీవ్రంగా ఉన్నాయి. 

పెద్ద ఎత్తున ధరలుపెంచి - కొత్త బ్రాండ్లు అమ్ముతున్న ప్రభుత్వం

అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ధరలు పెంచారు. ధరలు పెంచితే  తాగే వారి సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని, త‌ద్వారా ద‌శ‌ల వారీగా మ‌ద్య నిషేదాన్ని అమ‌లు చేసేందుకు వీలుంటుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.  ఇప్పుడు వ‌చ్చే రెండు సంవ‌త్స‌రాలు చాలా కీలకం.  ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న సమయంలో ప్ర‌భుత్వం మరో సారి మ‌ద్యం పాల‌సిని అమ‌లు చేసేందుకు చ‌ర్యలు తీసుకోవాల్సి వ‌చ్చింది. జ‌నాబా ప్రాతిప‌దిక‌న మూడు సంవ‌త్స‌రాల పాటు, పాల‌సిని అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.  

ఇప్పుడు మూడేళ్ల బార్ పాలసీ విడుదల 

వచ్చే ఎన్నికల నాటికి స్టార్ హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేసి ఆ తర్వాతే ఓట్లు అడుగుతామని వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రచారంచేశారు. సీఎం జగన్ కూడా పలుమార్లు చెప్పారు.అయితే ఇప్పుడు మద్యం ఆదాయంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకు వస్తూండటమే కాదు ..  బార్ల విధానం కూడా మూడేళ్లకు ప్రకటించడంతో ఇక  ఏపీలో మద్య నిషేధం.. మద్య నియంత్రణ అనేది ఉండదని భావిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పూర్తిగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పక్కన పెట్టినట్లేనని అంచనా వేస్తున్నారు. 

Published at : 14 Jul 2022 01:48 PM (IST) Tags: cm jagan AP government Bar Policy Excise Policy Alcohol Prohibition

సంబంధిత కథనాలు

Spl Trains to Tirupati : తిరుపతికి టిక్కెట్లు దొరకడం లేదా ? ఇవిగోండి స్పెషల్ ట్రైన్స్ వివరాలు

Spl Trains to Tirupati : తిరుపతికి టిక్కెట్లు దొరకడం లేదా ? ఇవిగోండి స్పెషల్ ట్రైన్స్ వివరాలు

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Visakha News : సివిల్స్ కోచింగ్ కు వచ్చి ప్రేమ పేరుతో  జల్సాలు, అప్పులు చేసి ఆత్మహత్య!

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Crime News : దుప్పట్లు అమ్మేవాళ్లు మీ వీధిలో తిరిగారా ? అయితే తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులకు ఓ మాట చెప్పాల్సిందే ! ఎందుకంటే ?

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

టాప్ స్టోరీస్

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?