అన్వేషించండి

AP Government: ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై జగన్ సర్కారు న్యాయ పోరాటం - హైకోర్టు తీర్పుపై సుప్రీంకు 

AP Government: పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయ పోరాటం చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. 

AP Government: నిరుపేద ప్రజల కోసం నిర్మిస్తున్న ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలపై న్యాయం పోరాటం చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి నేడు ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లబోతున్నట్లు ప్రకటించింది. రాజకీయ కుట్రలు, కోర్టు కేసులు ఆటంకాలు దాటుకొని ఇటీవలే అమరావతిలోని ఆర్-5 జోన్ లో సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు అందజేయాలని మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభంచింది సర్కారు. అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్ర పూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. ఈక్మరంలోనే గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్ ప్రభుత్వం సవాల్ చేయనుంది. 

రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ సంఘాలు వేసిన పిటిషన్ విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇక్కడ వివిధ వర్గాలకు ఇళ్లు కట్టించేందుకు 1402 ఎకరాలు కేటాయించింది. ఇందులో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారిని లబ్ధిదారులుగా చేసింది. దీనిపైనే అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని వారు వాదిస్తున్నారు. 

హైకోర్టు తీర్పులో కీలక అంశాలు 

హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కీలక అంశాలు ఉన్నాయి.  అమరావతి ఆర్‌5 జోన్‌లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను  వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.  స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ కట్టడానికి కాదనిస్ష్టం చేసింది.  అదే సమయంలో  ప్రభుత్వం తామే నిర్ణయించిన భూమి విలువ రూ.   345 కోట్లు  CRDA కు చెల్లించలేదని హైకోర్టు ధర్మాసనం మరో కారణంగా తెలిపింది. మూడో కారణంగా మొత్తం ఖర్చు 1500 - 2000 కోట్లు ...స్థలాలు/ ఇల్లు...తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు దీనికి భాధ్యత ? వహిస్తారని  ప్రశ్నించింది.  ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది.  

సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజా ధనం వృధా                               

అమరావతి తీర్పు లో కూడా ఆప్పటి వరకు  చేసిన ఖర్చు వృధా అవుతుందని కోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది.  CRDA నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన వారికి హౌసింగ్ కోసం 5 శాతం భూమి కేటాయించారని... కానీ బయట వారికి స్థలాలు ఇస్తామని తెచ్చిన సవరణలు చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు.  ఈ పరిస్థితులలో ఇళ్ళ నిర్మాణం అనుమతించ లేమని ధర్మానసం స్పష్టం చేసింది.  సుప్రీం లో కేసులు తేలిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని  తీర్పు చెప్పింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget