AP Govt Holidays :2023లో 23 హాలీడేస్, ఏపీ సాధారణ సెలవుల లిస్ట్ ఇదే!
AP Govt Holidays : 2023 సాధారణ సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. మొత్తం 23 రోజులు హాలీడేస్ గా ప్రకటించింది.
AP Govt Holidays : వచ్చే ఏడాది(2023) సాధారణ సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 14, 15, 16 సాధారణ సెలవుల జాబితాలో చేర్చించింది. భోగి, సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి రెండో శనివారం, ఆదివారం వచ్చాయని పేర్కొంది. మార్చి 22న ఉగాది సెలువుగా తెలిపింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్‌నబీ తేదీల్లో మార్పులు చేర్పులు జరిగాయని ఉత్తర్వులో తెలిపింది.
వచ్చే ఏడాది 23 సెలవులు
వచ్చే ఏడాది సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్‌నబీ పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుల ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులు వచ్చాయి. వచ్చే ఏడాదిలో నాలుగు పండుగ సెలవులు, రెండో శనివారం, ఆదివారాలు వచ్చాయి. ఇందులో భోగి పండుగ జనవరి 14న రెండో శనివారం వచ్చింది. సంక్రాంతి పండుగ జనవరి 15న ఆదివారం వచ్చింది. అక్టోబర్ 22న దుర్గాష్టమి కూడా ఆదివారం వచ్చింది. నవంబర్ 12 దీపావళి కూడా ఆదివారం రోజున వచ్చింది.
ఈ జాబితాలో వచ్చే ఏడాది ప్రభుత్వం ఇచ్చే సాధారణ సెలవులను ప్రకటించింది. ఇందులో సాధారణ సెలవులతో పాటు ఉద్యోగులకు లభించే ఐచ్చిక సెలవులు, ఇతర సెలవుల వివరాలను కూడా ప్రభుత్వం పేర్కొంది. అలాగే వచ్చే ఏడాది సెలవు రోజుల్లో వస్తున్న పండుగల వివరాలను ఈ జాబితాలో పొందుపర్చింది. సీఎస్ జవహర్ రెడ్డి పేరిట ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
ఐచ్ఛిక సెలవులు
కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1, హజ్రత్ అలీ పుట్టినరోజు ఫిబ్రవరి 5న, షబే బరాత్ కారణంగా మార్చి 7న, మహావీర్ జయంతి ఏప్రిల్ 4న, షబే ఖదర్ ఏప్రిల్ 18న ఆప్షనల్ హాలిడేస్ ప్రకటించింది. ఏప్రిల్ 21న జమాతుల్ విదా, ఏప్రిల్ 23న బసవ జయంతి, ఏప్రిల్ 24న షహాదత్ హజ్రత్ అలీ, మే 5న బుద్ధ పూర్ణిమ, జూన్ 20న రథయాత్ర, జూలై 6న ఈద్ ఏ ఘదీర్, మొహర్రం 9వ రోజున జూలై 28, పార్సీ కొత్త ఏడాది ఆగస్టు 16న ఆప్షనల్ సెలవులు ప్రకటించారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగస్టు 25న, అర్బయీన్ కారణంగా సెప్టెంబర్ 5న, హజ్రత్ సయ్యద్ మొహమ్మద్ జువాన్ పురి మెహదీ పుట్టినరోజు అవ్వడంతో సెప్టెంబర్ 9న ఆప్షనల్ సెలవులు ప్రకటించారు. మహాలయ అమావాస్య కారణంగా అక్టోబర్ 14న, విజయదశమి పండగ సందర్భంగా అక్టోబర్ 24న ,యజ్ దహుం షరీఫ్ కారణంగా అక్టోబర్ 26న, కార్తిక పౌర్ణిమ, గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 27న, డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా ఐచ్ఛిక సెలవులు ప్రకటించారు.