అన్వేషించండి

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

AP Govt Holidays: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt Holidays: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది(2024) సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నవంబరు 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులుగా(Optional Holidays) ప్రకటించింది. జనవరి 15, 16ను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. భోగి, అంబేడ్కర్ జయంతి ఆదివారం, దుర్గాష్టమి రెండో శనివారం వచ్చాయని తెలిపింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. 

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకారం.. జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగ సెలవులను ప్రకటించింది. జనవరి 26న రిపబ్లిక్‌ డే, మార్చి 3న మహా శివరాత్రి, మార్చి 25న హోళీ, మార్చి 29న గుడ్‌ ఫ్రై డే సెలవులుంటాయని ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులో స్ఫష్టం చేశారు. ఏప్రిల్‌ 5న బాబు జగ్జీవన్‌రాం జయంతి, 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి, జూన్‌ 17న బక్రీద్‌ సెలవులుంటాయని తెలియజేసింది. జూలై 17న మొహర్రం, ఆగస్టు 15 ఇండిపెండెన్స్‌ డే, 26 శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్‌ 7న వినాయక చవితి సెలవులు, 16న ఈద్‌-ఉల్‌-ఉన్‌-నబీ పండుగల సందర్భంగా సెలవులను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి, అక్టోబర్‌ 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ సెలవులు ఉంటాయని వెల్లడించింది . వీటితో పాటు మరో 17 ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది .

ఆదివారాలు, రెండో శనివారాలకు అదనంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే ఇతర సెలవులతో కూడి జాబితాను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. పండుగలు, వేడుకలు, ఇతర సందర్భాలు ఇందులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వ సంస్ధలు, కార్పోరేషన్లతో పాటు ప్రభుత్వం కింద పని చేసే అన్ని సంస్ధలు, ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ముస్లింల పండుగలైన రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీలకు కూడా ఇందులోనే సెలవులు ప్రకటించినప్పటికీ ఏదైనా మార్పు ఉంటే అప్పుడు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

20 సాధారణ సెలవులు ఇవే..

➥ మకర సంక్రాంతి: 15.01.2024.

➥ కనుమ: 16.01.2024.

➥ రిపబ్లిక్ డే: 26.01.2024.

➥ మహాశివరాత్రి: 08.03.2024.

➥ హోలీ: 25.03.2024.

➥ గుడ్ ఫ్రైడే: 29.03.2024.

➥ బాబు జగ్జీవర్ రామ్ జయంతి: 05.04.2024.

➥ ఉగాది: 09.04.2024.

➥ ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్): 11.04.2024.

➥ శ్రీరామ నవమి: 17.04.2024.

➥ బక్రీద్: 17.06.2024.

➥ మొహార్రం: 17.07.2024.

➥ ఇండిపెండెన్స్ డే: 15.08.2024. 

➥ శ్రీకృష్ట జన్మాష్టమి: 26.08.2024.

➥ వినాయక చవితి: 07.09.2024.

➥ ఈద్ మిలాద్-ఉన్-నబి: 16.09.2024.

➥ మహాత్మాగాంధీ జయంతి: 02.10.2024.

➥ దుర్గాష్టమి: 11.10.2024.

➥ దీపావళి: 31.10.2024.

➥ క్రిస్ట్‌మస్: 25.12.2024.

17 ఆప్షనల్ హాలిడేస్ (ఐచ్ఛిక సెలవులు) ఇవే..

➥ కొత్త సంవత్సరం దినోత్సవం (New Year Day): 01.01.2024.

➥ హజ్రత్ అలీ జయంతి: 25.01.2024.

➥ షబ్-ఈ-మెరాజ్: 07.02.2024.

➥ షహదత్ హజ్రత్ అలీ: 01.04.2024.

➥ జమాతుల్ వెద: 05.04.2024.

➥ బసవ జయంతి: 10.05.2024.

➥ బుద్ద పూర్ణిమ: 23.05.2024.

➥ ఈద్-ఎ-గదీర్: 25.06.2024.

➥ 9వ మొహార్రం: 16.07.2024.

➥ పార్సీ కొత్త సంవత్సరం దినోత్సవం: 15.08.2024.

➥ వరలక్ష్మి వ్రతం: 16.08.2024.

➥ మహాలయ అమావాస్య: 02.10.2024.

➥ యజ్-దహమ్-షరీఫ్: 15.10.2024.

➥ కార్తీక పూర్ణిమ/గురునానక్ జయంతి: 15.11.2024.

➥ హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువాన్‌పూర్ మెహదీ జయంతి: 16.11.2024.

➥ క్రిస్ట్‌మస్ ఈవ్: 24.12.2024.

➥ బాక్సింగ్ డే: 26.12.2024.

AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వంAP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించాడని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Embed widget