అన్వేషించండి

Low Rains: ముఖం చాటేసిన వరుణుడు, సాగు నీటికి కటకట - ఏపీలో అన్నదాతల ఆందోళన

Low Rains: ఏపీలో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పల్నాడులోని మిర్చి రైతులు పంట చేతికొస్తుందో లేదో తెలియక సతమతమవుతున్నారు.

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు సాగు మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేక, కాలువల ద్వారా సాగు నీరందక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. 

ఈ ప్రాంతాల్లో

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. డెల్టాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అటు డెల్టాలో టెయిల్ భూములకు, అప్ ల్యాండ్స్ కు నీరందడం లేదు. ఈ క్రమంలో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఓ పంటకు నీరందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి నీటిని డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో డెల్టాలో మొదటి పంటైనా చేతికొస్తుందన్న ఆశ రైతుల్లో నెలకొంది.

పల్నాడులోనూ

అటు పల్నాడులోనూ సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చెయ్యొద్దని రైతులకు సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈ ఏడాది వారబందీ పద్ధతిలో నీరు అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో రైతులు చాలా చోట్ల మిర్చి సాగు చేపట్టారు. అయితే, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంటను పీకేస్తోన్న రైతులు

ఈ క్రమంలో మిర్చి రైతులు ఆందోళనతో పంటను పీకేస్తున్నారు. పెదకూరపాడుకు చెందిన రైతు 5 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా, పంట ఎదుగుతున్న సమయంలో సాగు నీరు అందలేదు. కనీసం బోరు బావుల నుంచి కూడా నీరు అందివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్ల ముందే తన పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక 5 ఎకరాల్లో పంటను ట్రాక్టరుతో దుక్కి దున్నించేశాడు. దాదాపు నెల రోజులుగా సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నామని, ఇక పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకే ఇలా చేసినట్లు సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పల్నాడులోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కర్షకులు వాపోతున్నారు. మరో 10, 15 రోజుల్లో వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంట ఈ ఏడాది చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

తగ్గిన ఉల్లి దిగుబడి

మరోవైపు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి దిగుబడి సైతం తగ్గింది. దీంతో ధరలు సైతం పెరిగాయి. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.86 వరకూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ఉల్లి సాగుకు అగ్ర స్థానంలో నిలిచేది. జూన్ నుంచి అక్టోబర్ వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి తగ్గి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి సక్రమంగా లేదు. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Also Read: సామాన్యులకు షాక్ - ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, అదే కారణమా?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget