YS Jagan In Kadapa: రెండు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, అనంతరం కర్నూలు జిల్లాకు పయనం
YS Jagan In Kadapa: తన పర్యటనలో భాగంగా నేడు రెండు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కడప ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్ అధికారి నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు రెండో రోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు రెండు వివాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కడప ఎన్‌జీఓ కాలనీలో ఐఏఎస్ అధికారి నారపురెడ్డి మౌర్య వివాహ వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఇటీవల ఐఏఎస్ అధికారి వివాహం జరగగా, నేడు నూతన వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆదిత్య కల్యాణ మండపానికి చేరుకుని మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య ముందస్తు వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ వివాహం రేపు జరగనుండగా.. నేడు అక్కడికి వెళ్లి కడప మేయర్ కుమార్తెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ మంత్రి అంజాద్ బాషా, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, తదితర వైఎస్సార్ సీపీ నేతలు హాజరయ్యారు. కడపలో వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని, అక్కడ నుంచి కర్నూలుకు ముఖ్యమంత్రి జగన్ పయనం కానున్నారని అధికారులు తెలిపారు. అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి ముందస్తు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
కడప ఎన్‌జీఓ కాలనీలో నారపురెడ్డి మౌర్య (ఐఏఎస్) వివాహ వేడుకలకు హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్.
— YSR Congress Party (@YSRCParty) April 16, 2022
ఇటీవల (14, ఏప్రిల్) జరిగిన నారపురెడ్డి మౌర్య(ఐఏఎస్) వివాహం.
వధూవరులు నారపురెడ్డి మౌర్య, సత్యన్నారాయణరెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన సీఎం. pic.twitter.com/nhBgKMQuHC
కర్నూలుకు సీఎం జగన్..
సీఎం జగన్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మహిళా నేత, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బంధువుల వివాహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి వివాహం ఏప్రిల్ 17న నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారు. కర్నూలు జిల్లాకు వచ్చాక కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం క్రిష్ణానగర్‌లోని ఎమ్మెల్యే నివాసానికి సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కాబోయే వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. సీఎం కర్నూలు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల కోసం జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేయడంపై చర్చించారు. సీఎం జగన్ భద్రత విషయంపై జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గ్రీన్ ఛానల్ నిర్వహించాలని, అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Dharmana Prasadarao : మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చింది, కార్యకర్తకు దెబ్బ పడింది!