అన్వేషించండి

వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఎన్ని రోజులంటే!

CM Jagan Tour: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్నారు. 

CM Jagan Tour: సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.. వైయస్సార్‌ జిల్లా పర్యటించబోతున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. 

సెప్టెంబర్‌ 1వ తేదీ షెడ్యూల్‌.. 

మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం  బయలుదేరనున్న సీఎం, 3.30 గంటలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం  కాంప్లెక్స్‌ ను ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్‌ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేయనున్నారు.

సెప్టెంబర్‌ 2వ తేదీ షెడ్యూల్‌..

ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి, 9.00 – 9.40 గంటల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్‌ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాల అనంతరం ఎస్టేట్‌లోని వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు.

సెప్టెంబర్‌ 3 షెడ్యూల్‌.. 

ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

చివరి నిమిషంలో ఆగిపోయిన నెల్లూరు పర్యటన

ఇటీవల నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఖరారై అర్థాంతరంగా ఆగిపోయింది. ఆగస్టు 30న సీఎం జగన్ నెల్లూరు జిల్లాకు వస్తారని, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ చివరి నిముషంలో ఆ పర్యటన వాయిదా పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం జగన్ వస్తారని అంటున్నారు. సెప్టెంబర్ 4న సీఎం పర్యటన ఖరారైందని, అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు.

ఎందుకీ మార్పు?

సీఎం జగన్ పర్యటన వాయిదా పడటానికి ప్రధాన కారణం సంగం బ్యారేజ్ వర్క్స్ పూర్తి కాకపోవడమేనంటున్నారు. ఇటీవల సంగం బ్యారేజ్, పెన్నా బ్యారేజ్ పనులను మంత్రులు, జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించారు. దాదాపు పనులు పూర్తవుతున్నాయని సీఎం రావడమే ఆలస్యం అనుకున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా సీఎం జగన్ ని కలసి సంగం బ్యారేజ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఆ తర్వాతే సీఎం పర్యటన 30న ఖాయమైందంటూ అధికారిక ప్రకటన విడుదలైంది.

చవితి సెంటిమెంట్ ఉందా?

వినాయక చవితికి ముందు ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవం చేపట్టడం కంటే.. చవితి వెళ్లిపోయిన తర్వాత ఆ రెండు ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తే బాగుంటుందనే సెంటిమెంట్ కూడా ఉంది. దీంతో ఈ ప్రారంభోత్సవాలను వారం రోజులపాటు వాయిదా వేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద జగన్ పర్యటన ఖరారైందని అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత అది వాయిదా పడటం మాత్రం విశేషమే.  

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం, నవంబర్ 15 నాటికి ఎలక్షన్స్ పూర్తి: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం, నవంబర్ 15 నాటికి ఎలక్షన్స్ పూర్తి: సీఎం చంద్రబాబు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
BC Reservations: ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ భేటీ- బీసీలకు రిజర్వేషన్లపై మిశ్రా కమిషన్ నివేదికపై కీలక చర్చ

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget