అన్వేషించండి

AP CM Jagan: మహిళల ఖాతాల్లో ఏప్రిల్ 12న 15వేలు వేయనున్న జగన్ సర్కార్

AP CM Jagan: వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని అగ్రవర్ణ మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.

AP CM Jagan: అగ్రవర్ణ మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన వారిలో 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అందిస్తోంది. ఈ ఏడాది నిధుల విడుదల సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం జగన్.. ఈనెల 12వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రారంభించనున్నారు. బటన్ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తారు. రాష్ట్రంలోని రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందనుంది. రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ బటన్‌ నొక్కి వీరి ఖాతాల్లో వేయనున్నారు. 

మహిళల సాధికారతే లక్ష్యంగా..

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకంలో 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఓసీ వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏటా రూ. 15 వేలు మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద మహిళలకు ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల్లోని మహిళలకు ఏటా రూ. 15 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా అగ్రవర్ణ పేద మహిళలకు వైఎస్ఆర్ ఈజీసీ నేస్తం పథకం ద్వారా ఏటా రూ. 15 వేలు అందివ్వడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వయసు గల పేద మహిళలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. 

మహిళల ఆర్థిక సాధికారతతో పాటు సంక్షేమం, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో భాగంగా గర్భవతులు, బాలింతలు, చిన్నారుల కోసం వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మహిళల భద్రత కోసం అభయం, దిశ యాప్‌, గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్ల నియామకం చేపట్టినట్లు వెల్లడించింది. మహిళలకు సాధికారతే లక్ష్యంగా ఇళ్ల పట్టాలు వాళ్ల పేరు మీద ఇస్తున్నట్లు పేర్కొంది. 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Embed widget