CM Jagan TS High Court : ఆ కేసు కొట్టేయాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్
CM Jagan TS High Court : ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉన్న ఓ కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు హైకోర్టు స్టే విధించింది.
CM Jagan TS High Court : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohna Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. 2014 ఎన్నికల ప్రచారంలో నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఎన్నికల నియమావళి(Election code Violation) ఉల్లంఘించారని జగన్ పై అప్పట్లో కేసు నమోదు అయింది. ఈ కేసును కొట్టివేయాలని సీఎం జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించారని జగన్‌పై అభియోగాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్ హాజరుపై హైకోర్టు(High Court) ఏప్రిల్ 26 వరకు స్టే విధించింది.
ఇటీవల సీఎం జగన్ కు సమన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి (CM Jagan ) నాంపల్లి( Nampally ) ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఇవి అక్రమాస్తుల కేసులో వచ్చిన సమన్లు కావు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అభ్యర్థి తరపున నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ (Huzur Nagar) నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసులపై విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా నిందితులకు కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోపు తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించడంతో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు. నాంపల్లిలో (Nampally) ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేసులను త్వరగా పరిష్కరిస్తోంది. ఇటీవలి కాలంలో పలువురు ప్రజాప్రతినిధులకు జరిమానాలు, శిక్షలు ఖరారు చేస్తోంది. మరికొన్ని కేసుల్లో చురుగ్గా విచారణ జరుగుతోంది. కొంత మంది ప్రజాప్రతినిధులు తమ కేసుల నుంచి బయట పడుతున్నారు. ఎక్కువగా ఎన్నికల నియమావళికి సంబంధించిన కేసులే పరిష్కారమవుతున్నాయి. ఇతర క్రిమినల్ కేసుల విచారణ చురుగ్గా సాగుతోంది.
Also Read : Kodali Nani on TDP : చంద్రబాబు వల్లే టీఆర్ఎస్ ఏర్పడింది, టీడీపీపై మంత్రి కొడాలి నాని ఫైర్