అన్వేషించండి

CM Chandrababu: 'ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం - ఆదుకోండి' - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Andhrapradesh News: ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు.

CM Chandrababu Meet With Nirmala Sitharaman: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటన సాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) భేటీ అయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని.. తగిన చేయూత ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణాలకు నిధులు, అప్పులకు అనుమతుల సడలింపు వంటి అంశాలపై చర్చించారు. అలాగే, వివిధ పథకాలకు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. సుమారు అరగంట పాటు వీరి సమావేశం సాగింది. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలు ఉన్నారు. తొలుత నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను సీఎం కలిశారు. 

మరికొందరు కేంద్ర మంత్రులతోనూ భేటీ

మరికొందరు కేంద్ర మంత్రులతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం మంత్రి రామ్‌దాస్ అథవాలే, వేదంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్, ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఛైర్మన్ సంతోష్ యావద్‌లతో మధ్యాహ్నం భేటీ అవుతారు. అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యటన గురించి వివరిస్తారు. అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరుతారు.

ప్రధానితో భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా తొలి రోజు ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆయనకు వివరించారు. విభజన హామీల అమలుతో పాటు పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరుపై చర్చించారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు, పారిశ్రామిక రంగాలకు రాయితీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఈ నెల 6న (శనివారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్న క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారంపై సైతం వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన సీఎం వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌, మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియాను కలిసి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక మద్దతు కోసం వినతులందించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజనం చట్టం అమలుపై చర్చించారు.

అలాగే, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ వ్యయం రూ.385 కోట్లు, నిర్వహణ వ్యయం రూ.27.54 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఏపీకి ఐపీఎస్ అధికారుల సంఖ్య 117కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య 79గా ఉంది.

Also Read: Nara Lokesh: పిన్నెల్లికి జగన్ సపోర్ట్‌పై నారా లోకేశ్ కౌంటర్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Amaravati Seed Access Road inauguration:
"గ్రాఫిక్స్ అన్న వాళ్లే తలదించుకునేలా అమరావతి" సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో చంద్రబాబు కామెంట్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget