అన్వేషించండి

CM Chandrababu: త్వరలో 1.22 లక్షల ఉద్యోగాలు - ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Andhra News: రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి రూ.10 లక్షల పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తులో 1.22 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

CM Chandrababu Comments In Urjaveer Program: రాష్ట్రంలో విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. కృష్ణా జిల్లా పోరంకిలో (Poranki) శనివారం ఏర్పాటు చేసిన ఉర్జావీర్ (Urjaveer) కార్యక్రమాన్ని కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 'ఇప్పటికే ఎన్టీపీసీ, జెన్‌కో కలిసి రూ.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దీని వల్ల 1.22 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవే కాకుండా గ్రీన్ కో, రిలయన్స్ వంటి కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఐదేళ్లలో వివిధ సంస్థల నుంచి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పెరుగుతుంది. కరెంట్ ఉత్పత్తి ఎంత ముఖ్యమో, కరెంట్ ఆదా కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్లాలి.' అని సీఎం పేర్కొన్నారు.

'ఉర్జావీర్.. ఇంటి నుంచే ఆదాయం'

దేశంలో ఇంధన శాఖకు చాలా ప్రాముఖ్యత ఉందని.. వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 'తలసరి విద్యుత్ వినియోగం ఆ రాష్ట్ర ప్రగతికి చిహ్నం. సరికొత్త నైపుణ్యాలు నేర్చుకుంటేనే ప్రపంచంతో పోటీ పడగలం. దీని కోసం యువత ముందుకు రావాలి. 1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ రోజు రైతులు, పారిశ్రామికవేత్తలు, ఇళ్ల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు. 2004 నాటికి మనం మిగులు విద్యుత్ దశకు చేరుకున్నాం. ఎల్ఈడీ, ట్యూబ్‌లైట్లు ఇచ్చి గ్రామాల్లో వెలుగులు నింపాం. మేం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయి.

లక్ష మంది ఉర్జావీర్‌లు కావాలని భావించాం. 15 రోజుల క్రితం పిలుపునిస్తే వారంలో 12 వేల మంది ఉర్జావీర్‌లు నమోదు చేసుకున్నారు. ఒక్కో ఉర్జావీర్‌కు రూ.2,500 నుంచి రూ.15 వేల వరకూ అదనంగా ఆదాయం వస్తుంది. ఇంటి వద్దే ఉండి ఆదాయం సంపాదించే మార్గాల్లో ఇది ఒకటి. వర్క్ ఫ్రం హోం విధానం అన్ని రంగాల్లో పెరుగుతోంది. అంగన్వాడీ మహిళలకు ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాం. వీటి వల్ల 20 నుంచి 30 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. రాష్ట్రంలో సోలార్ కరెంట్‌ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలి.' అని సీఎం పిలుపునిచ్చారు.

Also Read: Nara Bhuvaneswari: సీఎం చంద్రబాబు తిన్న ప్లేట్ తీసిన మంత్రి లోకేశ్ - నీ విధేయత స్ఫూర్తిదాయకమంటూ నారా భువనేశ్వరి ప్రశంసలు, వైరల్ వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Flipkart Mobile Offers: ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ - గూగుల్ ఫోన్లు, ఐఫోన్లపై ఎంత తగ్గిందంటే?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget