అన్వేషించండి

Chandrababu Pawan In Mumbai: అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Chandrababu attends Anant Ambani Shubh Aashirwad ceremony | ముకేష్ అంబానీ, నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల శుభ్ ఆశీర్వాద్ వేడుకకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Pawan Kalyan attends Anant Ambani Shubh Aashirwad ceremony |  ముంబై: ముంబై: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అంబానీ ఫ్యామిలీ నుంచి వివాహ వేడుకలకు ఆహ్వానం అందడంతో శనివారం (జులై 13) నాడు ముంబైకి వెళ్లారు. జియో వరల్డ్ సెంటర్‌లో నేడు జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తన సతీమణి ఉపాసనతో కలిసి గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అంబానీల ఈవెంట్లోనూ బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ ఒకే ఫ్రేములో కనిపించారు. రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీల వేడుకకు హాజరయ్యారు. 

Chandrababu Pawan In Mumbai: అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మాటలా. దేశ, విదేశాల నుంచి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, హాలీవుడ్ సెలబ్రిటీలు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మూడు రోజుల పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు. జులై 12న అనంత్, రాధికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం నాడు అనంత్, రాధికలకు ఆశీర్వాదం అందించే శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ లను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ అధినేత వారిని భుజంతట్టి, కొంతసేపు మాట్లాడారు. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అంబానీ స్వాగతం
ఏపీ సీఎం చంద్రబాబు అనంత్ అంబానీ - రాధికా మర్చంచ్‌ల వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లే షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అటు నుంచి నేరుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు చేరుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌ను ఆప్యాయంగా పలకరించి కాసేపు వారితో ముచ్చటించారు. 

ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాత్రికి నారిమన్ పాయింట్ లోని ఓబెరాయ్ హోటల్లో చంద్రబాబు దంపతులు బస చేయనున్నారు. ఆదివారం (జులై 14న) ఉదయం ముంబైలోని మఖేష్ అంబానీ నివాసం ఆంటీలియాలో ఫంక్షన్ కు హాజరవుతారు. ఈ వేడుకల అనంతరం ముంబై నుంచి విజయవాడకు ఏపీ సీఎం చంద్రబాబు తిరుగు పయనమవుతారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంటారు.   

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
Mohammed Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
Advertisement

వీడియోలు

వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!
ఏసయ్యే నన్ను నడిపించాడు.. విక్టరీ తర్వాత కన్నీళ్లతో జెమీమా
ఫైటింగ్ సెంచరీతో ఫైనల్ బెర్త్ తెచ్చింది..  పిచ్ మీద పడి చిన్నపిల్లలా ఏడ్చింది
పనికిరాదని పక్కన కూర్చోబెట్టారు.. పోరాడి ఫైనల్‌కి తీసుకెళ్ళింది
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. దశాబ్దాల కలకి అడుగు దూరంలో..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
మంత్రి పదవులు ఆశించిన వారికి ఇతర పదవులు - రాజగోపాల్ రెడ్డికి అక్కడా నిరాశే !
Begging banned in AP:  ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
ఏపీలో భిక్షాటనకు పూర్తి నిషేధం - బెగ్గర్లకు పునరావాసం- చట్టం అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - ఇవిగో పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్
Mohammed Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
తెలంగాణ మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్- మైనార్టీ సంక్షేమం లేదా క్రీడా శాఖ కేటాయించే ఛాన్స్!
New Rules From November 1:బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
బ్యాంకింగ్ రూల్స్ నుంచి ఆధార్ వరకు నవంబర్ నుంచి వస్తున్న 5 పెద్ద మార్పులు ఇవే!
Fauzi Actress Imanvi: ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్... చుడిదార్ కట్టినా క్యూట్‌గా ఉంది కదూ!
ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్... చుడిదార్ కట్టినా క్యూట్‌గా ఉంది కదూ!
Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Friday Fashion : చలికాలంలో స్టైలిష్‌గా కనిపించాలా? ఈ వింటర్ ఫ్యాషన్ టిప్స్ అబ్బాయిల కోసమే
చలికాలంలో స్టైలిష్‌గా కనిపించాలా? ఈ వింటర్ ఫ్యాషన్ టిప్స్ అబ్బాయిల కోసమే
Embed widget