AP CID: పీవీ రమేష్ వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ స్పందన - ఆయన స్టేట్ మెంట్ తో కాదు వ్యాఖ్యలతోనే కేసు ప్రభావితం!
AP CID: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ స్పందించింది. ఆయన స్టేట్ మెంట్ తో కేసు మొత్తం నడవలేదని, స్కిల్ కేసును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
AP CID: తాను ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో కేసు పెట్టారని.. ఇది దిగ్ర్భంతి కల్గే అంశం అని మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఐడీ స్పందించింది. పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ తోనే కేసంతా నడవలేదని.. సీఐడీ వర్గాలు బదులు ఇచ్చాయి. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేష్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రేమనని తెలిపింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం సహా నిధుల మళ్లింపునకు సంబంధించి కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నట్లు చెబుతున్నారు. పక్కా ఆధారాలతోనే కేసును ముందుకు తీసుకెళ్లామని సీఐడీ వర్గాలు వివరిస్తున్నాయి.
కేసు కోర్టు పరిధిలో ఉండగా పీవీ రమేష్ వ్యాఖ్యలు చేయడం అయోమయానికి గురిచేసే ప్రయత్నమే అవుతుందని.. ఇద దర్యాప్తును, విచారణను ప్రభావితం చేయడమే అవుతుందన్నారు. నిధుల విడుదలతో తన దిగువ స్థాయి అధికారి చేసి సూచనను పీవీ రమేష్ పట్టించుకోలేదన్నారు. రూ.371 కోట్లు విడుదల చేసే ముందు అంత మొత్తం ఒకేసారి విడుదల చేయడం సరైనది కాదని వారించారు. అలాగే పైలట్ ప్రాజెక్టుగా ఒక స్కిల్ హబ్ కు ముందుగా విడుదల చేద్దామని గట్టిగా సూచించారు. ఎక్కడో గుజరాత్ లో చూసి వచ్చాం, అంతా కెరక్టే అనుకోవడం సమంజసంగా లేదని పేర్కొన్నారు. ఈ అభ్యంతరాలను,, సూచనలను పీవీ రమేష్ పక్కన పెట్టారన్నారు. ఇలా ఎన్నో అంశాలు కేసులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. పీవీ రమేష్ చెప్పినట్లుగా హాస్యాస్పదంగానో, పేలవంగానో కేసును బిల్డ్ చేయలేదని సీఐడీ వర్గాలు స్పష్టం చేశాయి.