అన్వేషించండి

AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

 

AP Cabintet :  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.    బందరు పోర్టు కు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 3940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. 9.75 శాతం వడ్డీతో రూ. 3940 కోట్ల రుణం తీసుకోనుంది. అటు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్… యూనిట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంత, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపారు. సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యూఎనర్జీ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్.. 2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్.. 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ.55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55వేల కోట్లు పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా రూ.1,10,000 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెట్టనుంది. ఫేజ్ వన్‌లో 30 వేల మందికి, ఫేజ్‌ టూ లో 31వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా… 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.అలాగే వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.

కేబినెట్ సమావేశంలో రెండు శాఖల మంత్రుల్ని సీఎం  జగన్ ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలుస్తోంది.  విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనీ బాగా పనిచేస్తున్నారని సీఎం ప్రశంసించారు. తన మంత్రిత్వ శాఖ ధాన్యం సేకరణలో బాగా పని చేసిందని..  మరో మంత్రి కారుమూరి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందించాలా అని జగన్ చమత్కరించారు. పౌరసరఫరాల శాఖ కూడా బాగా పని చేస్తోందన్నారు. 

ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైయస్‌ఆర్‌ లా నేస్తం, వైయస్‌ఆర్‌ ఆసరా, ఈబీసీ నేస్తం, వైయస్‌ఆర్‌ కల్యాణమస్తు పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పిస్తూ మౌనం పాటించింది.

                              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Advertisement

వీడియోలు

Ro - Ko at India vs South Africa ODI | రాంచీలో రో - కో జోడి
Rajasthan Royals to be Sold IPL 2026 | అమ్మకాన్ని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ?
Ab De Villiers comment on Coach Gambhir | గంభీర్ పై డివిలియర్స్ కామెంట్స్
Lionel Messi India Tour 2025 | భారత్‌కు లియోనెల్ మెస్సీ
Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Cyber Fraud :హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం - మోనికా పేరుతో వైద్యుడిపై వల- రూ. 14 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు
Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం 
Cyclone Ditwah Impact: దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
దూసుకొస్తున్న దిత్వా తుపాను- ఈ జిల్లాల్లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే ఛాన్స్‌!
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Hema Chandra : శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
శ్రావణ భార్గవితో డివోర్స్ రూమర్స్! - సింగర్ హేమచంద్ర స్ట్రాంగ్ రియాక్షన్
Balakrishna: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ - గాడ్ ఆఫ్ మాసెస్ ఫోటోలు
Rajinikanth : వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
వంద జన్మలకూ మళ్లీ మళ్లీ రజనీలానే పుట్టాలని ఉంది - తలైవా ఎమోషనల్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
Embed widget