AP BJP Meeting : మంత్రులకూ రక్షణ లేదని చెబుతున్నారా ? - ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్ఆర్‌సీపీ పోటీ ఉద్యమాలన్న ఏపీ బీజేపీ !
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తి స్థాయిలో పోరాడతామని ఏపీ బీజేపీ ప్రకటించింది. మంత్రులపై దాడి జరిగిదంని ఆరోపిస్తున్నారని.. వారికీ కూడా రక్షణ లేదని చెబుతున్నారా అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
AP BJP Meeting : ప్రజా సమస్యల పరిస్కారం కోసం, ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారనే వైకాపా నాయకుల ఆరోపణలపై స్పందిస్తూ భాజపా దాడుల సంస్కృతిని ప్రోత్సహించదని, ఈ అంశంలో పోలీసులు నిష్షాక్షిక విచారణ జరపాలని తెలిపారు. దాడుల ఆరోపణలతో ప్రభుత్వం తమ అసమర్ధతను వెల్లడిస్తుందని విమర్శించారు. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న బీజేపీ పదాధికారు సమావేశంలో కీలక అంశాలపై చర్చలు జరిపారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికే పోటీ ఉద్యమాలు
ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను, రాజధాని కోసం చేస్తున్న ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా ప్రభుత్వం పోటీ ఉద్యమాలను ఉత్తరాంధ్రలో నిర్వహిస్తోందని బీజేపీ అభిప్రాయంపడింది. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయ అవగాహనతోనే వీరి ట్రాప్‌లో పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న పనులకు కూడా ఈ ప్రభుత్వం సహకరించకపోగా, ఎయిమ్స్ సంస్థకు కనీసం నీరు కూడా ఇవ్వడం లేదు. భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలు కూడా అభివృద్ధి చెందాలి. వైకాపా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయక, అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమల పట్ల నిర్ల్యక్షం వహించిందన్నారు. జకీయ డ్రామాతో కాలయాపన చేస్తోంది. ఈ విషయాన్ని భాజపా ప్రజాపోరు వీధి సభల ద్వారా ప్రజలకు తెలియచేసింది. యువత, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలు తమ సమస్యలను ప్రజాపోరులో పాల్గొని భాజపా దృష్టికి తెచ్చారు. ఈ ప్రజాపోరు ఉద్యమాన్ని ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించి మరో ప్రజా ఉద్యమం నిర్మాణానికి భాజపా సంకల్పించనుందని విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు.
ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల్ని వదిలి పెట్టే ప్రశ్నే లేదు !
ఎపీలో ప్రజావైఫల్యాలను భాజపా వదలదని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్ధానిక సంస్థలకు నిధులు పంపితే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది. వాటిని తీసుకురావాలి. దెబ్బతిన్న రహదార్లను నిర్మించే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వ పతనాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలో పాలనా వైఫల్యాలపై భాజపా మరో ప్రజాఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది. 96 ఏళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు కనుమరుగైతే, 94 ఏళ్ల ఆర్‌ఎస్‌ఎస్ భారత దేశానికి గొప్పనాయకులు, త్యాగమూర్తులను, దేశభక్తులను, ప్రధానులను అందించింది. తమ వైఫల్యాలు, ఆర్‌ఎస్‌ఎస్ విజయాలపై కమ్యూనిస్టులు ఆలోచన చేయాలి. విజయవాడలో జాతీయ సమావేశాలకు అంతర్జాతీయ నాయకులను పిలిచిన కమ్యూనిస్టు పార్టీకి ఎపీలోగాని, దేశంలో గాని అసలు ఉనికుందా? ప్రజలెందుకు తమను ఆదరించడం లేదో, లోక్‌సభ, శాసనసభల్లో ఎందుకు ప్రాతినిధ్యం కోల్పోయారో కమ్యూనిస్టు పార్టీ ఈ జాతీయ సమావేశాల్లో ఆత్మ విమర్శ చేసుకోవాలి.
పార్టీ పగ్గాలు చేపట్టేందుకు జంకి పారిపోయిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తూ, కార్యకర్తలను కలపలేరు కాని ప్రజలను కలుపుతామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. చీలిపోయిన కమ్యూనిస్టు పార్టీలు కలవవు. మీ నాయకులు, కార్యకర్తులు కలిస్తే అప్పుడు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లను విమర్శించే హక్కు వస్తుంది. రాహుల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దాడులు జరిగితే అది ప్రభుత్వ వైఫల్యమే !
జనసేన నాయకులు పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటిస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదు. మంత్రులపై దాడులు చేరని వైకాపా నాయకులు మాత్రమే ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్ధారించలేదు. దాడుల సంస్కృతిని భాజపా ప్రోత్సహించదు. సమర్ధించదు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిష్పక్షిక విచారణ జరపాలి. వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఒక వేళ ఈ సంఘటనలో దాడులు చేయడం నిజమైతే అది ప్రభుత్వ వైఫల్యమే. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని మీరే చెబుతారా? మంత్రులనే రక్షించుకోలేని ప్రభుత్వం ప్రజలనెలా కాపాడుతుంది? దీనికి వైకాపా సమాధానం చెప్పాలన్నారు.