Somu Veerraju : టీడీపీతో పొత్తు బీజేపీ-జనసేన రోడ్ మ్యాప్ పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
Somu Veerraju : టీడీపీ పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. బీజేపీ,జనసేన కలిసే పోటీచేస్తాయని స్పష్టంచేశారు.
Somu Veerraju : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) అన్నారు. బీజేపీ, జనసేన(Bjp Janasena) కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. టీడీపీతో పొత్తువుంటుందని చెప్పలేదు అదంతా మీడియా కల్పితమన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై వైసీపీ మంత్రుల(Minister)తో బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) నవరత్నాలను కేంద్రం నిధులతో అమలు చేస్తున్నారన్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి కేటాయించిందన్నారు. ప్రత్యేక హోదా(Special Status) కన్నా ప్రత్యేక ప్యాకేజీ(Special Package)తో ఎక్కువ నిధులు వచ్చాయని చంద్రబాబు(Chandrababu) అన్నారని, తర్వాత జగన్(Jagan) మాయలో పడి యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను కేంద్రం నిధులతోనే నిర్మిస్తామని సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు.
కర్నూలులో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ప్రశిక్షణా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొన్నాను. రాయలసీమ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది.రాష్ట్ర అభివృద్ధిలో @narendramodi గారి ప్రభుత్వ కృషిని తక్కువచేసి మాట్లాడుతున్న @ysjagan ప్రభుత్వ పెద్దలు (1/2) pic.twitter.com/avAjrssAC5
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 20, 2022
డైరెక్ట్ డిబేట్ కు సిద్ధం
ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులపై డైరెక్ట్ డిబేట్(Direct Debate)కు తాము సిద్ధమని సోమువీర్రాజు మంత్రులకు సవాల్ విసిరారు. ఆదివారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. ఏపీ విభజన(AP Reorganisation) తర్వాత కేంద్ర పన్నుల కింద రూ.24,500 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. 2020-21 నాటికి రూ.72,000 కోట్లు ఇచ్చామన్నారు. కేంద్రం నిధులతో నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలకు వాడుతున్నారన్నారు. కేంద్రం నిధులు(Central Govt Funds) వాడుకుంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. కడపలో బీజేపీ రణభేరీ సభకు భారీ స్పందన రావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారం(Ysrcp Govt)లోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు ఇచ్చామని ఇందుకోసం రూ.32 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం
కడప బీజేపీ రణభేరీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు(Somu Veerraju) మాట్లాడుతూ రాయలసీమ రణ భేరి(Rayalaseema Ranabheri) సాక్షిగా పెండింగ్ ప్రాజెక్టుల సాధనే బీజేపీ లక్ష్యమని తెలిపారు. రాయలసీమకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. రాయలసీమలో అనేక వనరులు ఉన్నాయన్నారు. సోమశిల ప్రాజెక్టు కోసం బద్వేలు ప్రజలు పోరాడుతున్నారని గుర్తుచేశారు. పోలవరం(Polavaram) ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) కక్షపూరిత పరిపాలన చేస్తుందని ఆరోపించారు. పులివెందులలో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆమె భూములు కబ్జా చేశారన్నారు. జగన్ వ్యక్తిగత కక్షలు మానుకోవాలని బీజేపీ హితవు పలికింది. ఇసుక, మట్టి అమ్ముకునే దొంగలకు బీజేపీ కార్యకర్తలు భయపడరన్నారు. చైనా, పాకిస్థాన్ లాంటి వారికే బీజేపీ భయపడలేదన్నారు.